మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By రామన్
Last Updated : మంగళవారం, 5 మార్చి 2019 (09:20 IST)

05-03-2019 మంగళవారం దినఫలాలు - విద్యార్థులు పోటీ పరీక్షల్లో...

మేషం: గృహానికి కావలసిన వస్తువులను సమకూర్చుకుంటారు. ఒక వ్యవహరమై న్యాయసలహా స్వీకరిస్తారు. ఆలయ సందర్శనాలు చేస్తారు. శ్రీవారు శ్రీమతి ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపిస్తారు. వైద్య, ఇంజనీరింగ్, శాస్త్ర, వాణిజ్య రంగాల్లో వారికి కలిసిరాగలదు. ఇతరులకు ధనం ఇవ్వడం వలన ఇబ్బందులను ఎదుర్కుంటారు.
 
వృషభం: ప్రైవేటు సంస్థల్లో వారు మార్పులకే చేయు యత్నాలు అనుకూలిస్తాయి. ఎలక్ట్రానికల్, ఇన్‌వెర్‌టర్ వ్యాపారస్తులకు పురోభివృద్ధి. ఉపాధ్యాయులకు ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. కొబ్బరి, చల్లని పానీయ, కూరగాయల వ్యాపారులకు కలిసిరాగలదు. కీలకమైన వ్యవహారాల్లో సరియై నిర్ణయాలు తీసుకుంటారు. 
 
మిధునం: విద్యార్థులు పోటీ పరీక్షల్లో సత్ఫలితాలు సాధిస్తారు. ఆకస్మికంగా మీలో వేధాంత ధోరణి కనపడుతుంది. ఆహార వ్యవహారాలు, ఉత్తర ప్రత్యుత్తరాల్లో మెళకువ వహించండి. పీచు, ఫోం, లెదర వ్యాపారస్తులకు ఆశించినంత పురోభివృద్ధి. పత్రికా, ప్రైవేటు సంస్థలలోని వారికి ఓర్పు, ఏకాగ్రత ఎంతో ముఖ్యం. 
 
కర్కాటకం: సహోద్యోగులతో వాగ్వివాదలకు దిగకండి. కానివేళలో బంధుమిత్రుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. కోర్టు వ్యవహరాలు పరిష్కార మార్గంలో పయనిస్తాయి. రాజకీయ, పారిశ్రామిక రంగాల వారికి ఎదురుచూస్తున్న అవకాశాలు దగ్గరకు వస్తాయి. మీ ఆలోచనులు, పథకాలు క్రియారూపంలో పెట్టి జయంపొందండి.
 
సింహం: విదేశీయానం కోసం చేసే యత్నాల్లో ఆటంకాలను ఎదుర్కుంటారు. హోటల్, క్యాటరింగ్ రంగాల్లోవారు పనివారితో ఇబ్బందులు తప్పవు. ఏదో సాధించలేక పోయామన్న భావం మిమ్మల్ని వెన్నాడుతుంది. పాత వస్తువులను కొని ఇబ్బందులకు గురవుతారు. స్త్రీలకు షాపింగ్ విషయాలలో అపరిచిత వ్యక్తుల పట్ల మెళకువ అవసరం.
 
కన్య: బ్యాంకింగ్, చిట్స్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం అధికమవుతుంది. ఉద్యోగ రీత్యా ఆకస్మికంగా ప్రయాణం చేయవలసి వస్తుంది. దూరప్రయాణాలలో మెళకువ అవసరం. స్త్రీలకు పనివారలతో ఒత్తిడి, చికాకులు తప్పవు. చిన్నారుల, ఖరీదైన వస్తువులు కొనుగోలు విషయంలో ఖర్చులు అంచనాలు మించుతాయి.  
 
తుల: గృహంలో స్త్రీల పట్టుదల, మొండివైఖరి వలన గృహంలో ప్రశాంతత లోపిస్తుంది. విలువైన వస్తువులు అమర్చుకోవాలనే మీ కోరిక త్వరలోనే నెరవేరుతుంది. ప్లీడర్లకు తమ క్లయింట్‌లు తీరు ఇబ్బందులకు గురిచేస్తుంది. అనవసరపు సంభాషణల వలన ముఖ్యులతో ఆకస్మిక భేదాభిప్రాయాలు తలెత్తే ఆస్కారం ఉంది.
 
వృశ్చికం: రాజకీయాల్లో వారికి అనుకోని మార్పు కానరాగలదు. స్త్రీలకు ఆరోగ్యపరంగాను, ఇతరరత్రా సమస్యలెదుర్కోవలసి వస్తుంది. సమావేశానికి ఏర్పాట్లు చేయడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. ఎవరికైనా ధన సహాయం చేసినా తిరిగిరాజాలదు. స్థిరాస్తి కొనుగోళ్లకు సంబంధించిన వ్యవహారాలు వాయిదా పడుతాయి. 
 
ధనస్సు: సాహయ యత్నాలకు సరైన సమయం కాదని గ్రహించండి. రచయితలకు, పత్రికా రంగంలోని వారికి పురోభివృద్ధి. ఉద్యోగస్తులకు అపరిచిత వ్యక్తుల వలన హానీ కలిగే ఆస్కారం ఉంది. స్త్రీల పట్టుదల, మొండివైఖరి వలన గృహంలో ప్రశాంతత లోపిస్తుంది. బ్యాంకింగ్ రంగాల్లో వారికి ఒత్తిడి, చికాకులు తప్పదు. 
 
మకరం: ప్రయాణాలలో మెళకువ అవసరం. ఏదైనా అమ్మకానికై చేయు యత్నాలు వాయిదాపడగలవు. ఇతరుల కారణంగా మీ కార్యక్రమాలు వాయిదా వేసుకోవలసి వస్తుంది. ఇతరుల గురించి హాస్యానికై మీరు చేసిన వ్యాఖ్యానాల వలన ఊహించని సమస్యలు తలెత్తుతాయి. ఉపాధ్యాయులకు శ్రమకు గుర్తింపు లభిస్తుంది. 
 
కుంభం: దంపతుల మధ్య అరమరికలు లేకుండా మెలగవలసి ఉంటుంది. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. నూతన రుణాల కోసం అన్వేషణ మొదలుపెడతారు. ప్రయాణాలలో మెళకువ చాలా అవసరం. ప్రింటింగ్ రంగాల వారికి బాకీల వసూళ్ళల్లో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. స్త్రీలకు పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి. 
 
మీనం: స్త్రీలకు టీవీ ఛానెళ్ల నుండి ఆహ్వానం, కానుకలు అందుతాయి. దీర్ఘకాలిక రుణాలు తీర్చి ఊరట చెందుతారు. మితిమీరిన శారీరక శ్రమ వలన ఆరోగ్యంలో ఇబ్బందులు తప్పవు. వైద్యులకు ఓర్పు, ఏకాగ్రత ఎంతో ముఖ్యం. మీ కళత్ర మొండివైఖరి మీకెంతో చికాకు కలిగిస్తుంది. గృహంలో మార్పులు చేర్పులు అనుకూలిస్తాయి.