శనివారం, 11 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By రామన్
Last Updated : సోమవారం, 4 మార్చి 2019 (08:51 IST)

04-03-2019 సోమవారం దినఫలాలు - స్త్రీల ఆంతరంగిక వ్యవహారాలు...

మేషం: ఉద్యోగస్తులు సభ, సమావేశాలలో చురుకుగా పాల్గొంటారు. సోదరీసోదరులతో సంబంధ బాంధవ్యాలు బాగుగా ఉంటాయి. ఆకస్మికంగా బిల్లులు చెల్లిస్తారు. విద్యార్థుల మొండి వైఖరి ఉపాధ్యాయులకు చికాకు కలిగిస్తుంది. పనివారలతో సమస్యలు తలెత్తుతాయి. బ్యాంకు లావాదేవీలకు అనుకూలం.
 
వృషభం: స్త్రీల ఆంతరంగిక వ్యవహారాలు బయటకు వ్యక్తం చేయడం వలన ఇబ్బందులు తప్పవు. కాంట్రాక్టర్లకు నూతన టెండర్లు అనుకూలిస్తాయి. ధనం ఏమాత్రం నిల్వ చేయలేకపోవడం వలన ఆందోళనకు గురవుతారు. ప్లీడర్లకు, ప్లీడరు గుమస్తాలకు సామాన్యం. ఉద్యోగస్తులకు అధికారుల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది.
 
మిధునం: కొత్తగా చేపట్టిన వ్యాపారాలు లాభదాయకంగా సాగుతాయి. లీజు, ఏజెన్సీలు, నూతన టెండర్ల విషయంలో పునరాలోచన అవసరం. రిప్రజెంటేటివ్‌లు తమ టార్గెట్లను సునాయసంగా అధికమిస్తారు. నిరుద్యోగుల ఆలోచనలు పలువిధాలుగా ఉంటాయి. రిప్రజెంటేటివ్‌లు తమ టార్గెట్లను సునాయనంగా అధికమిస్తారు.
 
కర్కాటకం: దంతులు నమ్మటం వలన నష్టుపోయే ఆస్కారం ఉంది. భాగస్వామిక చర్చలు అర్ధాంతరంగా ముగుస్తాయి. లాయర్లకు, ఆడిటర్లకు, డాక్టర్లకు ఒత్తిడి అధికమవుతుంది. స్త్రీలకు పనివారలతో చికాకులు తప్పవు. రిప్రజెంటేటివ్‌లు తమ టార్గెట్లను సునాయసంగా అధికమిస్తారు. ఉద్యోగస్తుల శక్తిసామర్థ్యాలకు గుర్తింపు లభిస్తుంది.
 
సింహం: హోటల్, క్యాటరింగ్, తినుబండారాలు వ్యాపారస్తులకు లాభదాయకం. అనుకోకుండా కొన్ని పనులు పూర్తిచేస్తారు. సంఘంలో మీ గౌరవ ప్రతిష్టలు ఇనుమడిస్తాయి. చేపట్టిన పనులు వాయిదాపడుతాయి. సన్నిహితులలో మార్పు మీకెంతో ఆశ్చర్యం కలిగిస్తుంది. ఉద్యోగస్తులు ఒత్తిడి, ప్రలోభాలకు దూరంగా ఉండడం మంచిది.
 
కన్య: ప్రియతముల, చిన్నారుల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. దూరప్రయాణాలు కొంత ఇబ్బందులు కలిగిస్తాయి. ఖర్చులు అధికమవుతాయి. ఉద్యోగస్తులకు తోటివారి ధోరణి చికాకుపరుస్తుంది. వ్యూహాత్మకంగా వ్యవహరించి ఒక సమస్య నుండి గట్టెక్కుతారు. విద్యార్ధలు రేపటి గురించి ఆందోళన చెందుతారు. 
 
తుల: గృహోపకరణాలను అమర్చుకుంటారు. పోస్టల్, టెలిగ్రాఫ్ రంగాలలో వారికి అనుకూలం. ప్రత్యర్థుల ఎత్తుగడలను సమర్థంగా ఎదుర్కుంటారు. సభలు, సమావేశాల్లో ప్రముఖులతో పరిచయాలేర్పడుతాయి. ప్రియమైన వ్యక్తుల కలయికతో మానసికంగా కుదుటపుడుతారు. సభలు, సమావేశాల్లో ప్రముఖులతో పరిచయాలేర్పడుతాయి.
 
వృశ్చికం: ఇతరులు మీ పట్ల ఆకర్షితులౌతారు. ఆలయాలను సందర్శిస్తారు. ఎలక్ట్రానిక్. ఎ.సి. రంగాల్లో వారికి కలిసిరాగలదు. స్త్రీల అభిప్రాయాలకు ఆమోదం లభించక పోవడంతో కుటుంబంలో చికాకులు తతెత్తుతాయి. ముఖ్యమైన పనుల విషయంలో నిర్లక్ష్యం పనికిరాదు. బ్యాంకు వ్యవహారాలలో అపరిచిత వ్యక్తుల పట్ల మెళకువ అవసరం. 
 
ధనస్సు: మీ భార్య మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. డాక్టర్లకు నిరుత్సాహం కానవస్తంది. ఉపాధ్యాయులకు బరువు, బాధ్యతలు అధికమవుతాయి. మొండి బాకీలు వసూలవుతాయి. మార్కెట్ రంగాలవారికి నిరుద్యోగుకు సదవకాశాలు లభిస్తాయి. రాజకీయాల వారు కార్యకర్తల వలన సమస్యలను ఎదుర్కొనక తప్పదు. 
 
మకరం: ఉపాధ్యాయులకు ఒత్తిడి, చికాకులు తప్పవు. గత కొంత కాలంగా వేధిస్తున్న సమస్యలు పరిష్కారమవుతాయి. మీ బలహీనతలు, మాటతీరు అదుపులో ఉంచుకోవడం క్షేమదాయకం. అనుకోని ఖర్చులు, ఇతరత్రా సమస్యల వలన మానసిక ప్రశాంతత లోపిస్తుంది. ప్రముఖులతో పరిచయాలు పెంచుకుంటారు. 
 
కుంభం: పరిశోధనాత్మక విషయాలపై ఆసక్తి చూపుతారు. మీకు నచ్చిన వారితో ఉల్లాసంగా గడుపుతారు. నూతన వెంచర్ల విషయంలో పునరాలోచన అవసరం. ప్రతి పని చేతిదాకా వచ్చిన వెనక్కి పోవుటవలన ఆందోళన పెరుగుతుంది. పెద్దల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. పత్రికా సంస్థల్లోని వారికి ఏకాగ్రత అవసరం. 
 
మీనం: ఆస్తి పంపకాల్లో సోదరుల మధ్య ఏకీభావం నెలకొంటుంది. ఇతరులు మీ పట్ల ఆకర్షితులౌతారు. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్లు, ప్లీడరు గుమస్తాలకు ఊహించని చికాకులు ఎదురవుతాయి. అనుకున్నవి సాధించి, ఎనలేని తృప్తిని పొందుతారు. పాత జ్ఞాపకాల గురించి మీ మిత్రులతో చర్చించడంలో ఉల్లాసాన్ని పాలు పొందుతారు.