బుధవారం, 27 నవంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By
Last Updated : శనివారం, 13 అక్టోబరు 2018 (11:12 IST)

గోమాతకు అరటిపండ్లను ఆహారంగా అందిస్తే..?

గోమాతను పూజించే వారికి సకల శుభాలు చేకూరుతాయి. ఈతిబాధలుండవు. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. సమస్త దేవతలు గోమాతలో కొలువై వుంటారని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు.

గోమాతను పూజించే వారికి సకల శుభాలు చేకూరుతాయి. ఈతిబాధలుండవు. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. సమస్త దేవతలు గోమాతలో కొలువై వుంటారని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు. అందుకే గోవును పూజించడం ద్వారా సమస్త దేవతలను పూజించిన ఫలితం దక్కుతుంది. ఇంకా గోమాతకు అమావాస్య తిథిలో అవిసె ఆకులను ఇవ్వడం ద్వారా పితృదేవతలను సంతృప్తిపరచవచ్చు. 
 
ఇంకా నానబెట్టిన గోధుమలను గోవుకు ఆహారంగా అందించడం ద్వారా పేరు ప్రతిష్టలు చేకూరుతాయి. నీటితో మెత్తగా చేయబడిన రాగిపిండికి బెల్లాన్ని జోడించి గోవుకి పెట్టడం వలన దారిద్య్ర బాధలు తొలగిపోతాయి. గోవుకు చక్కెర పొంగలి, ఉప్పుతో ఉడికించిన అన్నాన్ని ఆహారంగా అందించినట్లైతే.. ఆర్థిక ఇబ్బందులు పటాపంచలవుతాయి. 
 
నానబెట్టిన బొబ్బర్లు గోమాతకి పెట్టడం వలన ఆర్ధిక పరిస్థితులు మెరుగుపడతాయి. నానబెట్టిన శనగలు గోవుకి పెట్టడం వలన ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. నానబెట్టిన పెసలు గోవుకు పెట్టడం వలన విద్యాభివృద్ధి కలుగుతుంది. 
 
కంటి దృష్టిని తొలగించుకోవాలనుకునేవాళ్లు ఉడికించిన బంగాళా దుంపలను గోవుకు పెట్టవలసి ఉంటుంది. ఇక అప్పుల బాధలతో ఇబ్బంది పడేవారు నానబెట్టిన కందిపప్పును గోవుకు ఆహారంగా అందిస్తే రుణబాధల నుంచి విముక్తి పొందుతారు. పండ్లను గోవులకు ఆహారంగా అందిస్తే.. అనుకున్న కార్యాలు విజయవంతమౌతాయని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు.