ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By chj
Last Modified: బుధవారం, 20 సెప్టెంబరు 2017 (18:18 IST)

దోషాలు దరిచేరకుండా ఉండాలంటే ఇలా చేయాలి...

నవగ్రహాలు.. బుధుడు, శుక్రుడు, కుజుడు, బృహప్పతి, శని, రాహు, కేతువు, సూర్యుడు, చంద్రుడు అని మొత్తం తొమ్మిది గ్రహాలు ఉంటాయి. వీటి స్థితి కారణంగానే వ్యక్తుల జాతకాలు చెబుతారు జ్యోతిష్యులు. గ్రహ దోషాలు ఉంటే కొందరు పూజలు కూడా చేస్తుంటారు. నవ్రగహాలు ఎక్కువగా

నవగ్రహాలు.. బుధుడు, శుక్రుడు, కుజుడు, బృహప్పతి, శని, రాహు, కేతువు, సూర్యుడు, చంద్రుడు అని మొత్తం తొమ్మిది గ్రహాలు ఉంటాయి. వీటి స్థితి కారణంగానే వ్యక్తుల జాతకాలు చెబుతారు జ్యోతిష్యులు. గ్రహ దోషాలు ఉంటే కొందరు పూజలు కూడా చేస్తుంటారు. నవ్రగహాలు ఎక్కువగా శివాలయాల్లోనే ఉంటాయి. 
 
నవగ్రహాల్లో ఒక్కో గ్రహానికి ఒక్కో అధిష్టాన దేవత ఉంటుంది. ఆ దేవతలను నియమించింది శివుడే. దీంతో పాటు గ్రహాలకు మూలమైనటువంటి సూర్యదేవుడికి అధిదేవత కూడా శివుడే. ఈ కారణంగానే గ్రహాలన్నీ కూడా శివుడు ఆదేశానుసారమే సంచరిస్తూ ఉంటాయి. ఆదిదేవుడు పరమశివుని అనుగ్రహం ఉంటే శని దోషాలు ఎలాంటి ప్రభావం చూపలేవని పురాణాలు చెబుతున్నాయి. అందుకే చాలామంది భక్తులు శివాలయాల్లో నవగ్రహ పూజలు చేసినా, చేయకున్నా శివునికి మాత్రం అర్చన, అభిషేకం చేయిస్తుంటారు.
 
శివాలయాలే కాకుండా వేరే ఆలయాల్లో నవగ్రహాలున్నా ఆ చుట్టూ ప్రదక్షిణలు చేయాలని జ్యోతిషులు చెబుతున్నారు. శివుని ఆలయానికి వెళ్ళినప్పుడు సాధారణంగా నవగ్రహాలను దర్శించాలా లేదా లేకుంటే నవగ్రహాలను దర్శించాలా లేదా అన్న సందేహం చాలామందిలో ఉంటుంది. శివాలయానికి వెళ్ళినప్పుడు శివున్ని దర్శించవచ్చు.. లేకుంటే ముందుగా నవగ్రహాలను పూజించవచ్చు. ఎలా చేసినా శివానుగ్రహం పొందితే చాలంటున్నారు జ్యోతిష్యులు.