సోమవారం, 16 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : సోమవారం, 12 ఆగస్టు 2024 (11:50 IST)

బ్రహ్మముహూర్తంలో ఇంటి గుమ్మం వద్ద నేతి దీపం వెలిగిస్తే?

Ghee Lamp
తులసీ మొక్కలో లక్ష్మీదేవి వుంటుంది. కాబట్టి మొక్కకు ఎల్లప్పుడూ నీటిని పోస్తూ ఓం నమో భగవతే వాసుదేవాయ.. అనే విష్ణు మంత్రాన్ని జపించాలి. ఇలా చేస్తే ఆనందం, ఐశ్వర్యం వుంటుంది. బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి ఓంకారాన్ని 21 సార్లు స్మరించాలి. తర్వాత 21 నిమిషాలు ధ్యానం చేయాలి. 
 
రోజూ ఉదయాన్నే స్నానం చేసి రాగి పాత్రలో నీళ్లు తీసుకుని అందులో పువ్వులు వేసి సూర్యుడికి అర్ఘ్యం సమర్పించడం వల్ల లక్ష్మీదేవి ప్రసన్నమవుతుంది. ఇలా చేస్తే వ్యాధులు దరిచేరవు. 
 
ఉదయాన్నే ఇంటి గుమ్మం వద్ద నెయ్యి దీపం వెలిగిస్తే సకల దేవతలు సంతోషిస్తారని విశ్వాసం. అలాగే రోజూ చేస్తే ఇంట్లోని వాస్తు దోషాలు తొలగిపోతాయని నమ్మకం. బ్రహ్మముహూర్తంలో దేవతలు భూలోకానికి దిగి వస్తారు. ఈ సమయంలో లక్ష్మీదేవిని పూజిస్తే సర్వాభీష్టాలు చేకూరుతాయి.