ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్

రైలులో అగ్నిప్రమాదమంటూ పుకార్లు... రన్నింగ్‌లో ఉండగా దూకేసిన ప్రయాణికులు!

train
రైలులో అగ్నిప్రమాదమంటూ పుకార్లు వచ్చాయి. దీంతో రైలు రన్నింగ్‌లో ఉండగానే అనేక మందిం ప్రయాణికులు కిందకు దూకేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బిల్‌పూర్ సమీపంలో చోటుచేసుకుంది. అగ్నిప్రమాదం చోటుచేసుకుందన్న పుకార్లతో భయాందోళనలకు గురైన కొంతమంది ప్రయాణికులు కదులుతున్న రైల్లోంచి కిందికి దూకేశారు. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. 
 
రైల్వే పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు.. హౌరా - అమృత్‌సర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు బరేలీలోని బిల్‌పుర్ స్టేషన్‌కు చేరుకున్న సమయంలో.. ఓ జనరల్‌ బోగీలో మంటలు చెలరేగినట్లు వదంతులు వ్యాప్తించాయి. దీంతో గుర్తుతెలియని వ్యక్తులు ఎమర్జెన్సీ చైను లాగారు. అంతలోనే అగ్నిప్రమాదం భయంతో పలువురు ప్రయాణికులు కదులుతున్న రైలులోనుంచి కిందికి దూకేశారు. ఈ ఘటనలో ఆరుగురికి గాయాలయ్యాయి.
 
రైలులో కొంతమంది ఆకతాయిలు అగ్నిమాపక పరికరాన్ని వినియోగించారని.. దీంతో మంటలు చెలరేగినట్లు భావించిన ప్రయాణికులు కిందికి దూకేశారని తొలుత అధికారులు పేర్కొన్నారు. 12 మందికి గాయాలైనట్లు తెలిపారు. ఈ ఘటనపై ఆర్పీఎఫ్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.