కవలలకు జన్మనిచ్చిన మహిళ.. కడుపులో టవల్ పెట్టి కుట్టేశారు..
ఉత్తరప్రదేశ్‌లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ప్రాణాలు కాపాడాల్సిన వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. డెలివరీ కోసం వచ్చిన మహిళ కడుపులో టవల్ పెట్టి కుట్టేశారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఆలీగఢ్ లోని జీటీ రోడ్డు లో గల శివ్ మహిహా ఆసుపత్రికి ఇటీవల వికాస్ కుమార్ అనే వ్యక్తి తన భార్యను డెలివరీ కోసం తీసుకువెళ్లారు. అక్కడ ఆమెకు కవలలు జన్మించారు.
ఆపరేషన్ సమయంలో వైద్యుల తీవ్ర నిర్లక్ష్యం ఆ తర్వాత బయటపడింది. ఆపరేషన తర్వాత ఆమెకు కడుపులో నొప్పి రావడంతో వేరే ఆస్పత్రి వైద్యులు చెక్ చేయడంతో అసలు సంగతి బయటపడింది. ఆమె కడుపులో టవల్ వుండటాన్ని వైద్యులు టెస్టుల ద్వారా కనుగొన్నారు. వెంటనే ఆమెకు శస్త్ర చికిత్స చేసి కడుపులోని టవల్ ను తొలగించి ఆమెను కాపాడారు.
ఆపరేషన్ సమయంలో వైద్యుల నిర్లక్ష్యానికి సీరియస్ అయిన ఆమె భర్త తాజా శస్త్ర చికిత్సకు సంబంధించిన వీడియోను జత చేస్తూ వైద్య ఆరోగ్య శాఖకు ఫిర్యాదు చేశారు.
ఇందుకు సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడం, పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తడంతో చీఫ్ మెడికల్ ఆఫీసర్ దర్యాప్తునకు ఆదేశించారు.