శుక్రవారం, 29 నవంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 15 ఏప్రియల్ 2022 (20:17 IST)

ఇప్పనూనెతో ఇన్ని లాభాలా...? కాలభైరవునికి దీపం వెలిగిస్తే? (video)

Puja room
ఇప్పచెట్టు, ఇప్పనూనె పవిత్రమైనవి. కొన్ని పుణ్యక్షేత్రాల్లో ఇప్పచెట్టును పూజించడం చేస్తుంటారు. భారతీయ సంప్రదాయ వృక్షాల్లో ఇప్పచెట్టుకు ప్రత్యేక స్థానం వుంది. ఇక ఈ చెట్టులో కాసే ఇప్పకాయలను నూనె కోసం ఉపయోగిస్తున్నారు. వీటి నుంచి నూనెను వేరు చేస్తారు. 
 
ఈ ఇప్పనూనె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అంతేగాకుండా ఆధ్యాత్మిక పరంగానూ ఉపయోగపడుతుంది. ఇప్పనూనెతో దీపం వెలిగిస్తే ఐశ్వర్యం సిద్ధిస్తుంది. ఇప్పనూనె సకల దేవతలకు, పరమేశ్వరునికి ప్రీతికరమైనది. 
 
అందుకే శివాలయాల్లో ఇప్పనూనెతో దీపమెలిగించే ఆచారం పూర్వ కాలం నుంచే వుంది. ముఖ్యంగా అష్టమి తిథి నాడు కాలభైరవునికి ఇప్పనూనెతో దీపం వెలిగిస్తే సమస్త దోషాలు తొలగిపోతాయని.. అప్పులు వుండవని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. 
 
ఇప్పనూనెతో దీపం వెలిగించడం ద్వారా అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. బ్రహ్మ ముహూర్త కాలంలో  మంగళ, శుక్రవారాల్లో పంచముఖ దీపంలో తెల్లని వత్తులతో ఇప్పనూనెతో దీపం వెలిగిస్తే అష్టలక్ష్మీ అనుగ్రహం ఆ కుటుంబ సభ్యులకు లభిస్తుంది. 
 
అదేవిధంగా, ఇప్పనూనెలో పసుపు వత్తులతో దీపం వెలిగించడం వల్ల కుబేరుని ఆశీస్సులు, వివాహం, సంతాన ప్రాప్తి చేకూరుతుంది. అలాగే ఇప్పనూనెతో ఎర్రని వత్తులతో దీపం వెలిగించే వారికి ఆర్థిక ఇబ్బంగులు, పేదరికం ఇతరత్రా దోషాలు తొలగిపోతాయి. ఇప్పనూనెతో తలంటు స్నానం చేస్తే శరీర వేడి తగ్గుతుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.