శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 11 ఏప్రియల్ 2022 (13:03 IST)

రిలయన్స్ జియో నుంచి మంత్ వ్యాలిడిటీ ప్లాన్‌

jioservice
రిలయన్స్ జియో తన కస్టమర్లకు అధిక లాభాలను అందించే  కొత్త క్యాలండర్ మంత్ వ్యాలిడిటీ ప్లాన్‌ను తీసుకువచ్చింది. జియో ప్రీపెయిడ్ ప్లాన్ లిస్ట్ లి కొత్తగా చేరిన ఈ ప్రీపెయిడ్ ప్లాన్ రూ.259 రూపాయలకు వస్తుంది. 
 
ఈ కొత్త జియో రూ.259 ప్రీపెయిడ్ ప్లాన్ పూర్తి నెల రోజుల వ్యాలిడిటీతో పాటుగా డైలీ అధిక డేటా, అన్లిమిటెడ్ కాలింగ్ వంటి మరిన్ని ప్రయోజాలను కస్టమర్లకు అందిస్తుంది. 
 
జియో రూ.259 ప్రీపెయిడ్ ప్లాన్ అన్ని నెట్‌వర్క్‌లకు అన్‌లిమిటెడ్ కాలింగ్ ప్రయోజనంతో వస్తుంది. ఈ ప్లాన్ పూర్తి నెల రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. మొత్తం వ్యాలిడిటీ కాలానికి గాను రోజుకు 1.5జీబీ హై స్పీడ్ డేటాని కూడా అఫర్ చేస్తుంది. 
 
ఈ ప్లాన్ తో వచ్చే డైలీ డేటా లిమిట్ ముగిసిన తరువాత వేగం 64కేబీపీఎస్‍‌‌కి తగ్గించ బడుతుంది. అధనంగా, ఈ ప్లాన్ డైలీ 100 ఎస్ఎంఎస్‌లను కూడా అందిస్తుంది. జియో అన్ని యాప్స్‌కి కూడా ఉచిత యాక్సెస్‌ను తీసుకువస్తుంది.
 
ఇక సంవత్సరం మొత్తం అధిక లాభాలను అందించే బెస్ట్ ప్లాన్ కోసం చూనట్లయితే జియో యొక్క రూ.2,999 ప్రీపెయిడ్ ప్లాన్ బెస్ట్ అని చెప్పొచ్చు.