శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 15 డిశెంబరు 2021 (16:11 IST)

జియో అదుర్స్.. ఒక్క రూపాయికి 100 ఎంబీ డేటా

రిలయన్స్ జియో మిగిలిన ప్యాకేజీలతో పాటు టారిఫ్‌లను పెంచింది. టారిఫ్‌లను అనూహ్యంగా పెంచిన జియో, వినియోగదారులకు మరో ఊరటనిచ్చే విధంగా ఓ ప్రకటన చేసింది. 
 
అదేమంటే, రూపాయికే 100 ఎంబీ డేటాను అందిస్తున్నట్టు ప్రకటించింది. రూపాయికి 100 ఎంబీని ఏ మొబైల్ నెట్‌వర్క్ సంస్థ ఇప్పటి వరకు అందించలేదు. 28 రోజుల వ్యాలిడిటీ కాకుండా 30 రోజుల వ్యాలిడిటీని ప్రకటించి సంచలనం సృష్టించింది.
 
జియో 1 జీబీ డేటాను రూ.15కి అందిస్తున్న సంగతి తెలిసిందే. 1 రూపాయికి 100 ఎంబీ డేటా అంటే, 10 రూపాయలకు 1 జీబీ డేటా వస్తుందన్నమాట.