ఓజీ లేటెస్ట్ అప్‌డేట్... ప్రకాశ్ రాజ్ పోస్టర్ రిలీజ్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - దర్శకుడు సుజిత్ కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం "ఓజీ". ఈ నెల 25వ తేదీన రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రం మేకర్స్ గురువారం ఓ సర్‌ప్రైజ్ ఇచ్చారు. ఇందులో విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ పాత్రను పరిచయం చేస్తూ ఓ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఇందులో ప్రకాశ్ రాజ్ సీరియస్ లుక్‌లో కనిపించారు. పోస్టర్ ఆధారంగా ఆయన పాత్ర కీలకమని అర్థమవుతుంది.
ఈ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఓజీ రూపొందుతోంది. ఇందులో పవన్ ఇప్పటివరకూ ఎన్నూడూ చూడని పాత్రలో ఓజాస్ గంభీర అనే గ్యాంగ్‌స్టర్‌గా కనిపించనున్నారు. ఆయన సరసన ప్రియాంక్ మోహన్ నటించారు. ఇమ్రాన్ హష్మీ విలన్. శ్రియారెడ్డి, అర్జున్ దాస్ తదితరులు కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం దీని పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. కాగా, ఈ చిత్రం ఆడియో, ట్రైలర్‌ను ఈ నెల 21వ తేదీన విడుదల చేయనున్నారు.