గురువారం, 23 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 1 ఏప్రియల్ 2022 (19:49 IST)

బరువు తగ్గాలంటే.. రోజూ ఐదు వెల్లుల్లి రెబ్బలు చాలు..

బరువు తగ్గాలంటే.. రోజూ పది వెల్లుల్లిపాయలు చాలు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఉదయం పూట పరగడుపున రోజూ ఐదు వెల్లుల్లి రెబ్బలను పెనంపై వేపి తీసుకుని.. ఒక గ్లాసు వేడి నీరు తాగితే కొవ్వు ఇట్టే కరిగిపోతుంది. ఐదు వెల్లుల్లి రెబ్బలను కాల్చి తిని ఒక గ్లాసు గోరువెచ్చని నీటిని తాగవచ్చు. 
 
ప్రతి రోజు 15 రోజుల పాటు తాగితే శరీరంలో ఉన్న వ్యర్థాలను బయటకు పంపుతుంది. శరీరంలో అదనంగా పెరుకుపోయిన కొవ్వును కరిగిస్తుంది. అలాగే శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. జీర్ణశక్తి పెరుగుతుంది. తినాలనే కోరిక తగ్గటమే కాకుండా తొందరగా ఆకలి కూడా వేయదు. తద్వారా సులభంగా బరువు తగ్గవచ్చునని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. 
 
అంతేగాకుండా ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో రెండు వెల్లుల్లి రెబ్బలను క్రష్ చేసి వేయాలి. ఆ తర్వాత అరచెక్క నిమ్మరసం కలిపి తాగాలి. గ్యాస్ సమస్య ఉన్నవారు పరగడుపున తాగకూడదు. బ్రేక్ ఫాస్ట్ చేశాక తాగవచ్చు. 
 
ఇలా తాగటం ఇబ్బందిగా ఉంటే రాత్రి సమయంలో ఒక గ్లాసు నీటిలో రెండు వెల్లుల్లి రెబ్బలను వేసి మరుసటి రోజు ఆ నీటిని వడకట్టి నిమ్మరసం కలిపి తాగవచ్చు. వెల్లుల్లి రెబ్బలను దంచి చేసి నీటిలో మరిగించి వడకట్టి కూడా తాగవచ్చు.