1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By ఎంజీ
Last Updated : గురువారం, 11 నవంబరు 2021 (13:15 IST)

బరువు తగ్గించే క్యాలరీలు వున్న డైట్ ఇదే...

శరీర బరువు అదుపులో ఉండాలంటే ఆహారం విషయంలో కొన్ని నియమాలను పాటించుకుంటూ వ్యాయామం చేస్తే సరిపోతుందని చెబుతున్నారు నిపుణులు. కొన్ని ఆహార పదార్థాలు ఆరోగ్యానికి చాలా అవసరం. అవి ఆరోగ్యానికే కాదు శరీర బరువును అదుపులో ఉంచుతాయి...
 
క్యాప్సికం:- క్యాప్సికంలో విటమిన్‌ 'సి' పుష్కలంగా ఉంటుంది. ఇది చెడు కొలెస్ట్రాల్‌ను తొలగిస్తుంది. అలాగే రుచిగా, కారంగా ఉంటాయి. 100 గ్రా|| క్యాప్సికం శరీరానికి అవసరమైన 20 శాతం క్యాలరీలను అందిస్తాయి.
 
ఆపిల్‌:- ఆపిల్‌ పండు ముక్కలను రోజు తిన్నా ఆరోగ్యానికి చాలా మంచిది. దీంట్లో ఖనిజ లవణాలు, విటమిన్లు, ఫైబర్‌ సమృద్ధిగా ఉంటాయి. ఇవి ముఖ్యంగా వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి. 100 గ్రా||ఆపిల్‌ పండ్లు, 50 శాతం క్యాలరీలను అందిస్తుంది.
 
పాలకూర:- పాలకూరలో పోషకాలు, విటమిన్లు, ఐరన్‌ పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో ఉండే టాక్సిన్లను తొలగించటానికి ఉపయోగపడతాయి. 100 గ్రా|| పాలకూర, 23 శాతం క్యాలరీలను అందిస్తుంది.
 
క్యాబేజీ:- క్యాబేజీలో విటమిన్లు, ఖనిజ లవణాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీరంలో ఉండే మలినాలను తొలగిస్తాయి. అలాగే చెడు కొలెస్ట్రాల్‌ను కరిగిస్తాయి. 100 గ్రా|| క్యాబేజీ, 25 శాతం క్యాలరీలను అందిస్తుంది.
 
బ్లూ బెర్రీ:- బ్లూ బెర్రీలో ఎక్కువ శాతం న్యూట్రీన్లు ఉంటాయి. ఇవి మంచి యాంటీ ఆక్సిడెంట్‌గా పని చేస్తాయి. ఇవి అధిక రక్తపోటు ఉన్న వారు తింటే సరిపోతుంది. అలాగే రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతాయి. 100 గ్రా|| బ్లూ బెర్రీ, 57 శాతం క్యాలరీలను అందిస్తాయి.
 
క్యారెట్స్‌:- క్యారెట్‌లో బీ-కెరోటిన్లు, ఫైబర్‌ పుష్కలంగా ఉంటాయి. క్యారెట్‌ను రోజు జ్యూసు చేసుకొని తాగితే ఆరోగ్యానికి, అందానికి చాలా మంచిది. వీటిలో ఉండే ఫ్రీ రాడికల్స్‌ ముఖ్యంగా శరీరంలో ఉండే మలినాలను తొలగిస్తాయి. 100 గ్రా|| క్యారెట్స్‌, 40 శాతం క్యాలరీలను అందిస్తాయి.
 
డార్క్‌ చాక్లెట్‌:- డార్క్‌ చాక్లెట్‌ న్యూట్రినల్‌ గుణాలను కల్గి ఉంటుంది. దాంట్లో ఉండే ఫ్లేవినాయిడ్స్‌, పాలీఫినొల్స్‌, నూట్రీన్లు ముఖ్యంగా శరీర బరువును అదుపులో ఉంచుతాయి. డార్క్‌ చాక్లెట్‌ ముఖ్యంగా అధిక రక్తపోటును అదుపులో ఉంచుతుంది. 100 గ్రా|| డార్క్‌ చాక్లెట్‌, 500 క్యాలరీలను అందిస్తుంది.