1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By Selvi
Last Updated : బుధవారం, 29 అక్టోబరు 2014 (19:09 IST)

కార్తీక శుద్ధ అష్టమి.. Oct 31 శుక్రవారం గోపూజ చేయండి!

కార్తీక శుద్ధ అష్టమి.. అక్టోబర్ 31.. అదే శుక్రవారం పూట గోపూజ చేయడం విశేష ఫలితాలను ఇస్తుందని పంచాంగ నిపుణులు అంటున్నారు. గోవును లక్ష్మీదేవి స్వరూపంగా భావించి పూజలు చేయడం ఆనవాయితీ. 
 
అయితే కార్తీకంలో వచ్చే శుద్ధ అష్టమి నాడు గోపూజ చేయడం ద్వారా సకలసంపదలు చేకూరుతాయి. కార్తీక శుద్ధ అష్టమినే గోష్ఠాష్టమి అని పిలుస్తారు. శుక్రవారం పూట ఉదయాన్నే స్నానం చేసి .. పరిశుభ్రమైన వస్త్రాలను ధరించి పూజా మందిరంలో శ్రీకృష్ణుడి ప్రతిమను షోడశ ఉపచారాలతో సేవించాలి.
 
ఆ తరువాత గోశాలలో గల గోవును అలంకరించి, ప్రదక్షిణలు చేసి పూజించాలి. కొంతమంది మరింత భక్తిశ్రద్ధలతో ఈ రోజున గోష్ఠాష్టమి వ్రతాన్ని కూడా ఆచరిస్తుంటారు. గోవు లక్ష్మీదేవి స్వరూపంగా చెప్పబడుతోంది కనుక, గోవును పూజించడం వలన ఆ తల్లి అనుగ్రహం లభిస్తుంది. 
 
సిరిసంపదలకు ... పాడిపంటలకు కొదవనేది ఉండదని పండితులు అంటున్నారు. ఇంకా గోమాత పూజ సకల దేవతలను పూజించినట్లవుతుందని, తద్వారా ఈతిబాధలు, ఆర్థిక ఇబ్బందులు, వ్యాధులు దూరమవుతాయని పంచాంగ నిపుణులు సూచిస్తున్నారు.