మంగళవారం, 7 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : ఆదివారం, 29 డిశెంబరు 2024 (16:44 IST)

Somvati Amavasya 2024 సోమాతి అమావాస్య.. చెట్లను నాటండి.. ఈశాన్య దిక్కులో నేతి దీపం..

Somvati Amavasya 2024
అమావాస్య రోజున దీపాలు వెలిగించడం ద్వారా సర్వశుభాలు చేకూరుతాయి. ధనుర్మాసంలో ప్రస్తుతం ఏడాది చివరలో అమావాస్య తిథి వస్తుంది. అయితే ఈ ఏడాది డిసెంబరు 30న అంటే సోమవారం అమావాస్య వస్తుంది. ఈ రోజున శివయ్యకు పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెరలతో అభిషేకం చేయాలంటారు. అంతేకాకుండా.. పూర్వీకుల కోసం పిండ ప్రదానాలు, గంగా స్నానాదులు కూడా చేస్తే అఖండ పుణ్యం ప్రాప్తిస్తుందట. 
 
అదేవిధంగా రావిచెట్టుకు, శ్రీ మహా విష్ణువుకు ప్రత్యేక పూజలు నిర్వహించాలి. రావి చెట్టు చుట్టూ 108 సార్లు ప్రదక్షిణలు చేయాలి. రావి చెట్టుకు నూలు దారాన్ని చుట్టాలి. అనంతరం భగవంతుడికి పూజించిన పండ్లను బ్రాహ్మాణులకు దానంగా ఇవ్వాలి. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో పేదరికం తొలగిపోయి ఆర్థిక పరంగా మెరుగైన ఫలితాలొస్తాయి. 
 
ఈ అమావాస్య వేళ చెట్లను నాటడం వల్ల అదృష్టం మరింత పెరిగే అవకాశం ఉంది. ఇలా చేయడం వల్ల దేవతలు, పూర్వీకుల అనుగ్రహం లభిస్తుందని విశ్వాసం. ఈ అమావాస్య కాలంలో అశ్వత్థ, వేప, అరటి, మర్రి, తులసి, ఉసిరి చెట్లను నాటడం శ్రేయస్కరం. సోమవతి అమావాస్య రోజున సాయంత్రం సంధ్యా వేళలో ఈశాన్య దిక్కులో ఆవునేతితో దీపం వెలిగించాలి.