మంగళవారం, 7 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : గురువారం, 20 ఏప్రియల్ 2023 (22:39 IST)

గుళికా సమయంలో పెళ్లి చేస్తే ఏమౌతుందో తెలుసా? (video)

marriage
గుళికా సమయం అదృష్ట సమయం అని అందరికీ తెలుసు. శనిదేవుని కుమారుడు గుళికుడు ఈ సమయానికి అధిపతి. అందుకే దీనికి గుళికా అనే పేరు వచ్చింది. ఈ సమయంలో ఏం చేసినా పదే పదే పెరుగుతుందనేది విశ్వాసం. గుళికా సమయంలో ఓ ప్రక్రియను ప్రారంభిస్తే, అందులో విజయవంతం అవుతారనడంలో సందేహం లేదు. ఏ చర్యను పునరావృతం కాకూడదని అనుకుంటారో ఆ పనిని గుళికా సమయంలో చేయకూడదు. 
 
అందుకే గుళికా సమయంలో పెళ్లిళ్లు చేయరు. గుళికా సమయంలో వివాహం చేస్తే ఆ జీవితం అంత అనుకూలంగా వుండదని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. మళ్లీ పెళ్లి చేసుకునే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఆ సమయంలో పెళ్లికి దూరంగా ఉంటారు. ఈ సమయంలో బంగారు ఆభరణాలు తనఖా పెట్టడం, అప్పులు చేయడం, మృతదేహాలను ఎత్తుకెళ్లడం వంటి పనులు చేయకూడదు. ఇవన్నీ మళ్లీ మళ్లీ జరుగుతాయని నమ్ముతారు.  
 
అయితే గుళికా కాలంలో ఎలాంటి పనులు చేయవచ్చో చూద్దాం.. 
రాహుకాలం, యమగండంలో మంచి విషయాలను పక్కనబెట్టాలి. గుళికా సమయంలో ఎలాంటి శుభకార్యాలు చేయరు. అయితే ఈ సమయంలో బంగారు ఆభరణాలను కొనుగోలు చేయవచ్చు. ఈ సమయంలో కొనుగోలు చేసిన బంగారు ఆభరణాలు ఇంట్లో పెరుగుతాయని నమ్ముతారు. గుళికా సమయంలో అప్పుతీసుకోకూడదు. కానీ అప్పు తిరిగి ఇవ్వడం చేయవచ్చు. అలా చేస్తే, మరింత ధనాదాయం ఉంటుంది. ఇంకా రుణం పూర్తిగా చెల్లించబడుతుంది. ఈ అదృష్ట సమయంలో ఇలా చేస్తే డబ్బు వస్తుందని నమ్ముతారు.
 
ఎరుపు రంగుకు డబ్బును ఆకర్షించే శక్తి ఉంది. అందుచేత గుళికా సమయంలో ఒక గాజు గిన్నెలో ఎర్రటి పట్టు వస్త్రాన్ని ఉంచాలి. దీన్ని మీ పడకగదిలో లేదా ఎవరూ తరచుగా వెళ్లని ప్రదేశాలలో ఉంచవచ్చు. ప్రతిరోజూ అందులో మీకు వీలైనంత ఎక్కువ డబ్బు ఆదా చేసుకోవచ్చు.
 
కుటుంబ సభ్యులు లేదా మీరు లేదా మీ పిల్లలు ఎవరైనా సరే, గుళికా సమయంలో ఆ ఎర్రటి సిల్క్ క్లాత్‌పై ప్రతిరోజూ కరెన్సీ నోట్లను సేవ్ చేయడం ద్వారా భారీ సంపదను పొందవచ్చు. అయితే ఇలా మీరు ఆదా చేసే డబ్బును రోజువారీ ఖర్చుల కోసం ఉపయోగించకూడదు.
 
మీరు పొదుపు చేసిన ఈ డబ్బుతో మంచి పనులు చేసుకోవచ్చు. మీ జీవితంలో జరిగే అతి పెద్ద విషయానికి కూడా దీనిని ఉపయోగించవచ్చు. మీరు ఇల్లు నిర్మించబోతున్నట్లయితే, మీరు దానికి ఈ మొత్తాన్ని జోడించవచ్చు. మీరు వ్యాపారాన్ని ప్రారంభించబోతున్నారా? మీరు కారు కొనబోతున్నారా? మీరు భూమి కొనుగోలు చేయబోతున్నారా? ఈ డబ్బును ఇలాంటి పనులకు ఉపయోగించవచ్చు. ఇలా చేస్తే మీ పనులు సజావుగా దిగ్విజయంగా పూర్తవుతాయని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.