బుధవారం, 27 నవంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By Raman
Last Modified: శనివారం, 11 నవంబరు 2017 (19:21 IST)

12-11-2017 నుంచి 18-11-2017 వరకు మీ వార రాశి ఫలితాలు

కర్కాటకంలో రాహువు, కన్యలో కుజుడు, తులలో రవి, శుక్ర గురువు, వృశ్చికంలో బుధుడు, ధనస్సులో శని, మకరంలో కేతువు. సింహ, కన్య, తుల, వృశ్చికంలలో చంద్రుడు. 16న రవి వృశ్చిక ప్రవేశం. మేషం: అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం

కర్కాటకంలో రాహువు, కన్యలో కుజుడు, తులలో రవి, శుక్ర గురువు, వృశ్చికంలో బుధుడు, ధనస్సులో శని, మకరంలో కేతువు. సింహ, కన్య, తుల, వృశ్చికంలలో చంద్రుడు. 16న రవి వృశ్చిక ప్రవేశం.  
 
మేషం: అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం 
సంప్రదింపులు, ఒప్పందాలకు అనుకూలం. గృహమార్పు అనివార్యం. శుభకార్యాల్లో అందరినీ ఆకట్టుకుంటారు. బంధుమిత్రుల ఆతిథ్యం ఆకట్టుకుంటుంది. మంగళ, శనివారాల్లో అవగాహన లేని విషయాల్లో జోక్యం తగదు. యత్నాలకు పరిస్థితులు అనుకూలిస్తయి. చాకచక్యంగా వ్యవహరిస్తారు. ఖర్చులు సంతృప్తికరం. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. పనులు నిదానం సానుకూలమవుతాయి. మీ శ్రీమతి వైఖరి అసహనం కలిగిస్తుంది. సంతానం భవిష్యత్తు పట్ల శ్రద్ధ అవసరం. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఉద్యోగ బాధ్యతల్లో మార్పులుంటాయి. అధికారులకు ధనప్రలోభం తగదు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నష్టాలు, ఆటంకాలను ధీటుగా ఎదుర్కొంటారు. దైవదీక్షలు స్వీకరిస్తారు. విద్యార్థులు, క్రీడాకారులకు అత్యుత్సాహం తగదు.
 
వృషభం: కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2పాదాలు  
మీ ప్రమేయంతో శుభకార్యం నిశ్చయమవుతుంది. బంధువులతో సంబంధాలు బలపడతాయి. ఆర్థిక అంచనాలు ఫలిస్తాయి. కొత్త విషయాలు గ్రహిస్తారు. పరిచయాలు ఉన్నతికి తోడ్పడతాయి. పదవులు, దీక్షలు స్వీకరిస్తారు. పనుల సానుకూలతకు మరింతగా శ్రమించాలి. ఖర్చులు సామాన్యం. పూర్వ విద్యార్థులను కలుసుకుంటారు. గత అనుభవాలు జ్ఞప్తికొస్తాయి. బాధ్యతలు అప్పగించవద్దు. గురు, శుక్రవారాల్లో ఒక సంఘటన ఆందోళన కలిగిస్తుంది. కుటుంబీకులతో సంప్రదింపులు జరుపుతారు. ఎదుటివారి అభిప్రాయాలకు విలువ ఇవ్వండి. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. వ్యాపారాలు ఊపందుకుంటాయి. సరుకు నిల్వలో జాగ్రత్త. రవాణా  రంగాల వారికి పురోభివృద్ధి. వనసమాధానలు, వేడుకల్లో పాల్గొంటారు. 
 
మిథునం: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు 
వ్యవహార దక్షతతో రాణిస్తారు. అవకాశాలు కలిసివస్తాయి. శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. శ్రమాధిక్యతతో పనులు పూర్తి చేస్తారు. ఆత్మీయుల ఆహ్వానం ఆలోచింపచేస్తుంది. ఖర్చులు అంచనాలను మించుతాయి. ధనానికి ఇబ్బంది ఉండదు. పొదుపు పథకాలు, పెట్టుబడులపై దృష్టి సారిస్తారు. శనివారం నాడు వ్యవహారాలు, బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. మొహమ్మాటాలు, భేషజాలకు పోవద్దు. మీఇష్టాయిష్టాలను కచ్చితంగా తెలియజేయండి. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. ఆరోగ్యం సంతృప్తికరం. ప్రియుతములతో ఉల్లాసంగా గడుపుతారు. విద్యార్థులతో ఏకాగ్రత నెలకొంటుంది. వృత్తి ఉపాధి పథకాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. వ్యాపారాల్లో ఒడిదుడుకులను ధీటుగా ఎదుర్కొంటారు. చిరు వ్యాపారులకు ఆశాజనకం. తీర్థయాత్రలకు సన్నాహాలు సాగిస్తారు. 
 
కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష  
గృహంలో స్తబ్ధత తొలగుతుంది. కొత్త యత్నాలు ప్రారంభిస్తారు. ఇంతకాలం పడిన కష్టం ఫలిస్తుంది. ధనలాభం, వస్త్రప్రాప్తి, వాహన యోగం పొందుతారు. సన్నిహితుల సలహా లాభిస్తుంది. కుటుంబీకులతో ఉల్లాసంగా గడుపుతారు. పనుల ప్రారంభంలో ఆటంకాలెదురవుతాయి. మీపై శకునాల ప్రభావం అధికం. పెద్దల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. సంతానం కదలికలపై కన్నేసి ఉంచండి. కిట్టని వారి తప్పుదారి పట్టించేందుకు యత్నిస్తారు. ఎవరినీ అతిగా విశ్వసించవద్దు. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. మీ పథకాలు సత్ఫలితాలిస్తాయి. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. సహోద్యోగులతో విందుల్లో పాల్గొంటారు. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. కళ, క్రీడాకారులకు ప్రోత్సాహకరం.
 
సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం 
ఈ వారం యత్నాలు పురోగతిన సాగుతాయి. గృహమార్పు కలిసివస్తుంది. సమస్యలను ధీటుగా ఎదుర్కొంటారు. రుణ విముక్తులవుతారు. ఖర్చులు సామాన్యం. కొన్ని పనులు అనుకోకుండా పూర్తవుతాయి. గృహంలో సందడి నెలకొంటుంది. ఆత్మీయులకు సాయం అందిస్తారు. పరిచయస్తుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. వ్యవహార ఒప్పందాలకు అనుకూలం. స్థిమితంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. దంపతుల మధ్య దాపరికం తగదు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. పెట్టుబడులపై దృష్టి సారిస్తారు. వ్యాపారాల విస్తరణలకు అనుకూలం. టెండర్లు, ఏజెన్సీలు దక్కించుకుంటారు. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత అవసరం. ఉపాధి పథకాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. పదవులు, సభ్యత్వాలు, దైవదీక్షలు స్వీకరిస్తారు. ఆస్తి, స్థల వివాదాలు కొలిక్కివస్తాయి.
 
కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు 
కొన్ని ఇబ్బందుల నుంచి బయటపడతారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. అవిశ్రాంతంగా శ్రమిస్తారు. కలిసివచ్చిన అవకాశాలను తక్షణం వినియోగించుకోండి. ఖర్చులు అధికం, ఆర్థిక వెసులుబాటు ఉంటుంది. ఆత్మీయుల సలహా లాభిస్తుంది. ఆది, సోమవారాల్లో పనులు మందకొడిగా సాగుతాయి. ప్రముఖుల దర్శనం కోసం పడిగాపులు తప్పవు. పెట్టుబడులకు సంబంధించిన సమాచారం సేకరిస్తారు. శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు అనుకూలం. దంపతుల మధ్య ఏకాభిప్రాయం నెలకొంటుంది. బంధువుల ఆతిథ్యం సంతృప్తినిస్తుంది. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఆకర్షణీయమైన పథకాలు రూపొందిస్తారు. ఉద్యోగస్తుల కృషి ఫలిస్తుంది. అధికారులకు ఆత్మీయ వీడ్కోలు పలుకుతారు. షేర్ల క్రయ విక్రయాలకు అనుకూలం. 
 
తుల: చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు 
ధనమూలక సమస్యలు ఆందోళన కలిగిస్తాయి. ఆత్మీయుల హితవు మీపై మంచి ప్రభావం చూపుతుంది. శుభకార్యాలకు హాజరవుతారు. పనులు నిదానంగా సానుకూలమవుతాయి. మంగళ, బుధవారాల్లో విజ్ఞతతో వ్యవహరించాలి. తప్పిదాలను సమర్థించుకోవద్దు. పరిచయస్తుల వ్యాఖ్యలు కష్టమనిపిస్తాయి. దుబారా ఖర్చులు అదుపు సాధ్యం కాదు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. కుటుంబ విషయాల పట్ల శ్రద్ధ అవసరం. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. గృహ నిర్మణాలు మందకొడిగా సాగుతాయి. చిన్ననాటి ఉపాధ్యాయుల కలయిక సంతృప్తినిస్తుంది. సంతనం విషయంలో శుభపరిణామాలు సంభవం. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులుండవు. సరుకు నిల్వలో జాగ్రత్త. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. అధికారులకు ధనప్రలోభం తగదు.
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట  
వ్యవహారాల్లో తప్పటడుగు వేసే ఆస్కారం ఉంది. ఆశాదృక్పథంతో ముందుకు సాగండి. కొన్ని విషయాలు మీ ఆదాయంపై ప్రభావం చూపుతాయి. గురు, శుక్రవారాల్లో ఖర్చులు విపరీతం. అవసరాలు, చెల్లింపులు వాయిదా వేసుకుంటారు. అర్థాంతంగా ముగించిన పనులు పూర్తి చేస్తారు. శుభకార్యానికి యత్నాలు సాగిస్తారు. ఒక సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. దంపతులకు కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. ఆత్మీయులతో సంప్రదింపులు జరుపుతారు. పెద్దల సలహా పాటించండి. పదవులు, బాధ్యతల నుంచి తప్పుకుంటారు. ప్రముఖుల కలయిక ఏమంత ఫలితం ఇవ్వదు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. ప్రకటనలు, దళారులను విశ్వసించవద్దు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. హోల్‌సేల్ వ్యాపారులకు పురోభివృద్ధి. సరుకు నిల్వలో జాగ్రత్త.
 
ధనస్సు: మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం 
శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు అనుకూలం. యత్నాలకు పరిస్థితులు అనుకూలిస్తాయి. మీ శ్రీమతి వైఖరిలో మార్పు సంభవం. ఊహలు, అంచనాలు ఫలిస్తాయి. చక్కని ప్రణాళికలతో ముందుకు సాగుతారు. శనివారం నాడు పనులు మొండిగా పూర్తి చేస్తారు. ముఖ్యమైన పత్రాలు అందుతాయి. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. పెద్దమొత్తం ధనసహాయం క్షేమం కాదు. బంధువుల మాటతీరు కష్టమనిపిస్తుంది. కొన్ని విషయాలు పట్టించుకోవద్దు. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. మీ ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తుంది. వివాదాలు కొలిక్కి వస్తాయి. ఆధ్యాత్మిక పట్ల ఆసక్తి కలుగుతుంది. దైవదీక్షలు స్వీకరిస్తారు. వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. వ్యాపారాల్లో నిలదొక్కుకుంటారు.
 
మకరం: ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు  
ఒక వ్యవహారంలో మీ జోక్యం అనివార్యం. పదవులు, దైవదీక్షలు స్వీకరిస్తారు. బాధ్యతలు, వ్యాపకాలు పెంపొందుతాయి. ఒత్తిళ్లు, మొహమ్మాటాలు ఎదుర్కొంటారు. తొందరపడి హామీలివ్వవద్దు. కుటుంబీకుల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. ఆది, సోమవారాల్లో కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. కొన్ని విషయాల్లో పట్టు సాధిస్తారు. అవకాశాలు కలిసివస్తాయి. ధనలాభం, వస్త్రలాభం, ప్రశాంతత పొందుతారు. పనులు సానుకూలమవుతాయి. పొదుపు పథకాలు, పెట్టుబడులకు అనుకూలం. గృహంలో మార్పుచేర్పులు చేపడతారు. వృత్తుల వారికి ఆదాయాభివృద్ధి, నిరుద్యోగులకు ఉద్యోగప్రాప్తి. ఉద్యోగస్తులు అధికారులకు చేరువవుతారు. హోల్‌సేల్ వ్యాపారులకు కొత్త సమస్యలు ఎదురవుతాయి. శుభకార్యంలో పాల్గొంటారు. విద్యార్థులకు అత్యుత్సాహం తగదు.
 
కుంభం: ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం,  పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు
గృహంలో మార్పుచేర్పులకు అనుకూలం. ఆరోగ్యం పట్ల మరింత శ్రద్ధ అవసరం. పిల్లల భవిష్యత్తుపై దృష్టి సారిస్తారు. సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. మనోధైర్యంతో ముందుకు సాగుతారు. ఆశలొదిలేసుకున్న బాకీలు వసూలవుతాయి. ఖర్చులు సామాన్యం. పనులు మొండిగా పూర్తి చేస్తారు. ప్రేమానుబంధాలు బలపడతాయి. అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. అవతలివారు మీ వ్యాఖ్యలను తప్పుగా భావిస్తారు. మంగళ, బుధవారాల్లో మీ ఇష్టాయిష్టాలను లౌక్యంగా తెలియజేయండి. శుభకార్యాలకు హాజరవుతారు. బంధుమిత్రుల ఆతిథ్యం సంతృప్తినిస్తుంది. పెట్టుబడులు, వ్యాపారాల విస్తరణలకు అనుకూలం. భాగస్వామిక చర్చలు ఫలిస్తాయి. ఉద్యోగస్తులు, అధికారులకు పనిభారం, విశ్రాంతి లోపం. వైద్య, న్యాయ రంగాల వారికి ఆదాయాభివృద్ధి. 
 
మీనం: పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి  
రాబడికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. పొదుపు పథకాల పట్ల ఆకర్షితులవుతారు. ప్రైవేట్ సంస్థల్లో మదుపు క్షేమం కాదు. ఆది, గురువారాల్లో నగదు డ్రా చేసేటప్పుడు జాగ్రత్త. మీ ఆలోచనల్లో మార్పు వస్తుంది. విజ్ఞతతో వ్యవహరిస్తారు. ఆందోళన తొలగుతుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. పనులు హడావుడిగా సాగుతాయి. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు. ఆరోగ్యం కుదుటపడుతుంది. ఆశ్చర్యకరమైన సంఘటనలెదురవుతాయి. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. ఆస్తి, స్థల వివాదాలు కొలిక్కి వస్తాయి. నూతన దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. అధికారులకు హోదా మార్పు, స్థానచలనం. ఉద్యోగస్తులకు యూనియన్‌లో గుర్తింపు లభిస్తుంది. సహోద్యోగులతో ఉల్లాసంగా గడుపుతారు. మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి.