Daily Horoscope
✕

ఈ పటాన్ని పూజ గదిలో ఉంచుకోవచ్చా..?

Updated: శుక్రవారం, 8 మార్చి 2019 (14:08 IST)
పూజా మందిరాలలో శివ కుటుంబ చిత్రపటాన్ని ఉంచుకోవచ్చా లేదా అనే సందేహం చాలామందికి కలుగుతుంటుంది. కొందరు చిత్ర పటాన్ని చూసి ఈ పటం ఉందేమిటి అని ప్రశ్నిస్తుంటారు. నిజానికి అసలు ఈ పటాన్ని పూజామందిరంలో ఉంచుకోవచ్చో లేదో వారికే తెలియదు. కానీ శివ కుటుంబంతో ఉన్న చిత్ర పటాన్ని పూజా మందిరంలో ఉంచడం చాలా మంచిదని ఆధ్యాత్మిక నిపుణులు చెబుతున్నారు. 
 
పార్వతీపరమేశ్వరులు లోకానికే తల్లిదండ్రులు. అన్యోన్య దాంపత్యానికి ఆదర్శమూర్తులు. పరమేశ్వరుడు ఆయుష్షును ప్రసాదిస్తే, అమ్మవారు విజయాన్ని చేకూరుస్తుంది. తమ బిడ్డలను అనుగ్రహించడంలోను, ఆదరించడంలోను ఆ తల్లిదండ్రులు ఎంతమాత్రం ఆలస్యం చేయరు. ఇక వినాయకుడు తనని ప్రార్థించిన వారికి ఎలాంటి విఘ్నాలు ఎదురుకాకుండా చూస్తాడు. 
 
విద్యాభివృద్ధిని కలిగిస్తాడు. కుమారస్వామి తేజస్సును, చైతన్యాన్ని కలిగిస్తాడు. జ్ఞానాన్ని పెంచడమే కాకుండా సంతానాన్ని అనుగ్రహిస్తాడు. ఇలా పార్వతీపరమేశ్వరులు, వినాయకుడు, కుమారస్వామి కుటుంబంలోని వారికి ఆయురారోగ్యాలను, విజయాలను, జ్ఞానాన్ని, చైతన్యాన్ని కలిగిస్తారు. అందువలన వాళ్లంతా కలిసి వున్న శివ కుటుంబ చిత్రపటం పూజా మందిరంలో ఉండటం చాలా మంచిదని అంటారు.

అన్నీ చూడండి

ఓట్ చోరీ చేసిన వారికి శిక్ష తప్పదు : రాహుల్ గాంధీ

నాన్నే కాలయముడయ్యాడు : నూడిల్స్‌లో విషం కల్పి భార్య, పిల్లల హత్య... ఆపై ఆత్మహత్య

విజయవాడ మేయర్ అభ్యర్థిగా వంగవీటి రాధ - భారీ ర్యాలీగా వెళ్లి నామినేషన్ దాఖలు

పుంగనూరులో చేతులెత్తేసిన వైకాపా.. ఎన్నికల్లో పోటీకి దూరం దూరం..

విజయవాడలో నవరాత్రి సంబరం - సాంస్కృతిక వైభవాన్ని చాటిన దాండియా ఉత్సవ్

అన్నీ చూడండి

18-10-2026... ఆదివారం నాటి రాశి ఫలాలు- కుటుంబ అవసరాల కోసం ముందుగానే..?

18-10-2026 నుంచి 24-10-2026 వరకు వారఫలాలు - భార్యాభర్తల మధ్య చీటికీ మాటికీ కలహం

Chanakya Niti: చాణక్య నీతి- ఎవరితోనూ పంచుకోకూడని ఐదు విషయాలేంటంటే?

17-10-2026 శనివారం నాటి రాశి ఫలాలు.. ఆర్థిక స్థిరత్వం పెరుగుతుంది...

శరన్నవరాత్రులు.. ఆరవ రోజు కాత్యాయనీ పూజ.. మంత్ర పఠనం ఎలా?

తర్వాతి కథనం
Show comments