Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

దైవ ఆరాధనకు ఏ సమయం కలిసొస్తుంది.. బ్రహ్మ ముహూర్తం, మధ్యాహ్నం, సాయంత్రం...?

Written By సెల్వి
Updated: మంగళవారం, 6 అక్టోబరు 2026 (23:25 IST)
Best time for god worship
దైవ ఆరాధనకు సమయం, కాలం, మంచి రోజు అంటూ ఏమీ లేదు. దైవ ఆరాధన చేయడం వల్ల మనసుకు ప్రశాంతత, నమ్మకం కలుగుతుంది, కష్టాలు తొలగిపోతాయి, దైవ అనుగ్రహం లభిస్తుంది అనేది నమ్మకం. దైవ ఆరాధన జీవితంలో మేలును, మార్పులను తీసుకువస్తుందని భక్తుల నమ్మకం. 
 
దైవ ఆరాధన పవిత్రమైన కార్యంగా, పాపాలను పోగొట్టే శక్తివంతమైన కార్యంగా భావించబడుతుంది. అయితే ఒక రోజులో కొన్ని నిర్దిష్ట సమయాల్లో చేసే పూజలకు చాలా శక్తి, ఫలితాలు ఎక్కువగా లభిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి. ఒక రోజులో ఏ సమయంలో దేవుడిని పూజిస్తే, ఏ ఫలితం లభిస్తుందో తెలుసుకుందాం.
 
తెల్లవారుజామున 04.30 - 06.00 : బ్రహ్మ ముహూర్తం అని పిలువబడే తెల్లవారుజాము సమయం, దైవ శక్తి ఎక్కువగా నిండి ఉన్న సమయంగా భావించబడుతుంది. అనుకున్నది 100% జరుగుతుంది. ఇంట్లో తరగని సంపద నిలుస్తుంది. ఇంకా జ్ఞానం, బుద్ధి కుశలత, తెలివితేటలు పెరుగుతాయి. ఆధ్యాత్మిక ఆలోచన పెరిగి, మనసులో ఉన్న భయం తొలగిపోయి, స్పష్టత ఏర్పడుతుంది.
 
ఉదయం 06.00-08.00 : సూర్యోదయం తర్వాత ఉదయం వేళలో దేవుడికి పూజ చేయడం ఇంట్లో లక్ష్మీ కటాక్షాన్ని, సుభిక్షాన్ని కలిగిస్తుంది. ఆ రోజు ఆనందంగా గడుస్తుంది. చురుకుదనం, సానుకూల శక్తి లభిస్తుంది.
 
మధ్యాహ్నం 12 గంటలు : ఈ సమయంలో పూజ పూర్వీకుల ఆశీర్వాదం లభిస్తుంది. కర్మలు, దోషాలు తొలగిపోతాయి.
 
సాయంత్రం 05.30 నుండి 06.30 : మహాలక్ష్మి ఇంట్లోకి ప్రవేశించే సమయం ఇది. పేదరికం తొలగిపోయి సంపద పెరుగుతుంది. సమృద్ధి, ప్రశాంతత చేకూరుతుంది.
 
రాత్రి నిద్రపోయే ముందు : దేవుడికి కృతజ్ఞతలు చెప్పే సమయం. మానసిక ఒత్తిడి, చెడు కలలు లేకుండా ప్రశాంతమైన నిద్ర వస్తుంది.
 
ఈ సమయాలను ఉపయోగించుకుని ముఖ్యమైన పూజలు, ప్రార్థనలు చేయవచ్చు. దేవుడి అనుగ్రహం పొందాలని, కోరికలు త్వరగా నెరవేరాలని కోరుకునే వారు ఈ సమయంలో తమ పూజలను చేసుకోవచ్చు. ఈ సమయాల్లో గుడికి వెళ్లి కూడా పూజించవచ్చు. అలా గుడికి వెళ్లలేని వారు ఇంట్లోనే దీపం వెలిగించి పూజించవచ్చు.
 
ఏదైనా ఒక నిర్దిష్ట కోరిక కోసం దైవ ఆరాధన చేసేవారు, ఆ కోరికకు తగిన సమయంలో ప్రతిరోజూ తప్పకుండా గుడికి వెళ్లి గానీ లేదా ఇంట్లో నుండి గానీ పూజ చేయవచ్చు. నిర్దిష్ట రోజులు, నిర్దిష్ట సమయంలో నిరంతరం ఒకే విషయం కోసం పూజ చేసినప్పుడు, ఆ ప్రార్థన నిరంతరం నెరవేరుతుందని ఆధ్యాత్మికంగా చెప్పబడుతుంది.
About Author
సెల్వి
Journalist since 2005. Former contributor at Eenadu & Andhra Jyothi Tamil Nadu Editions. Now in Sub Editor, Webdunia.... Read More

అన్నీ చూడండి

130 ఏళ్ల వాతావరణ చరిత్రలో పూరీలో గరిష్టంగా 36.6 డిగ్రీల ఉష్ణోగ్రత

ఎర్రవల్లి గ్రామంలో అదృశ్యమైన 45 ఎకరాల భూమిని గుర్తించాలి.. రేవంతన్న ఆదేశాలు

హోర్ముజ్ జలసంధిలో నౌకపై దాడి: 11 మంది భారతీయులకు గాయాలు

ఇటలీ ప్రధాని జార్జియా మెలోని గొంతుకు డీప్‌ఫేక్ ముప్పు.. అలా దరఖాస్తు..

Woman: భర్తను హత్య చేసిన మహిళకు, ప్రియుడికి యావజ్జీవ కారాగార శిక్ష

అన్నీ చూడండి

06-10-2026 - మంగళవారం నాటి రాశి ఫలితాలు.. ఓర్పుతో వ్యవహరిస్తే...?

05-10-2026 సోమవారం ఫలితాలు - ఆశించిన పదవి దక్కకపోవచ్చు...

04-10-2026 - ఆదివారం రోజువారీ రాశి ఫలాలు - ఆర్థిక వ్యవహారాల్లో స్పష్టత పెరుగుతుంది

అక్టోబర్ 10 నుండి 18 వరకు వైభవంగా బతుకమ్మ పండుగ

04-10-2026 నుండి 10-10-2026 వరకు వారఫలాలు - శుభలేఖ అందుకుంటారు

తర్వాతి కథనం
Show comments