శనివారం, 23 నవంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. ప్రార్థన
Written By సిహెచ్
Last Modified: మంగళవారం, 31 మార్చి 2020 (23:09 IST)

అన్ని సమస్యల నుంచి గట్టెక్కించే శ్రీరామ మంత్రం

భారతదేశం ఎంతో పురాతన చరిత్ర కలది. ప్రపంచ నాగరికతకు ముందే ఇక్కడ యుగ చరిత్రకు సంబంధించిన విషయాలు పురాణాలలో చెప్పబడి వున్నాయి. శ్రీరాముడు ఆయన సామర్థ్యం వేరే చెప్పనక్కరలేదు. ఎలాంటి కష్టాన్నుంచైనా తన భక్తులను ఇట్టే గట్టెక్కించే పరంధాముడు.

అలాంటి శ్రీరామచంద్రుడిని ధ్యానించడం వల్ల సకల సమస్యలు తొలగిపోతాయి. ప్రస్తుత కరోనా తదితర అనారోగ్య కారక సమస్యల నుంచి శ్రీరామ మంత్రం గట్టెక్కించగలదని జ్యోతిష నిపుణులు చెపుతున్నారు. 
 
కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం |
ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలమ్ ||
 
ఆపదా మపహర్తారం దాతారం సర్వసంపదామ్ |
లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహూమ్ ||
 
దక్షిణే లక్ష్మణోయస్య వామేచ జనకాత్మజా |
పురతో మారుతిర్యస్య తం వందే రఘునందనమ్ ||
 
రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేథసే |
రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః ||
 
మనోజవం మారుతతుల్యవేగం
జితేంద్రియం బుద్ధిమతాంవరిష్టం
వాతాత్మజం వానరయూథ ముఖ్యం
శ్రీరామదూతం శరణం ప్రపద్యే ||
 
శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే |
సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే ||
 
పై శ్లోకాలలో కనీసం చివరి శ్లోకాన్ని ధ్యానించినా చాలని చెపుతున్నారు.