నా మేనమామ కుమార్తెకు ఓ బోయ్ ఫ్రెండ్... ఆమెతో నా పెళ్లి... అనుమానంగా వుంది...
నాకు నా మేనమామ కూతురుతో పెళ్లి నిశ్చయమైంది. ఇప్పుడు ఆమె వయసు 25. తనతో నేను ఇటీవలే ఆమెతో శృంగారం చేసినపుడు ఎలాంటి ఫీలింగ్ లేదని చెప్పింది. తనకు ముందుగా ఓ బోయ్ ఫ్రెండ్ ఉండేవాడు. అతడితో ఆమె ఏమయినా శృంగారపరంగా దగ్గరై వుంటుందేమోనని అనుమానంగా వుంది... ప్లీజ్ చెప్పండి...!!
ఇలాంటి అపోహలతోనే చాలామంది యువకులు తమ జీవితాలను అనుమానాలతో గడుపుతుంటారు. బోయ్ ఫ్రెండ్స్ నేటి రోజుల్లో సాధారణమైన విషయమే. అలాగే అబ్బాయిలకు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నంత మాత్రాన వారితో సంబంధం ఉందనుకోవడం పొరబాటు. ముందు అలాంటి అపోహల నుంచి బయటకు వచ్చేయండి.
ఇక శృంగారం విషయానికి వస్తే... ఆమెలో ఎలాంటి చలనం ఉండటం లేదన్నది మానసికమైనది. ఫోర్ ప్లే లేకుండా అక్కడికే వెళితే ఇలాగే ఉంటుంది. పైగా పెళ్లి కాకముందు ఇలాంటి వాటిలో పాల్గొంటే ఆందోళన వుంటుంది. దీనితో ఎలాంటి ఫీలింగ్ లేకుండా వుంటుంది. కాబట్టి ఆమెపై అనవసరంగా అనుమానం పెంచుకుని మీలో మీరు కుమిలిపోవడం మానుకోండి. హాయిగా పెళ్లి చేసుకోండి.