Daily Horoscope
✕

నేను పికప్ చేస్కుంటానన్నా నా భార్య వాడి బైకెక్కుతోంది... ఏం చేయాలి?

Updated: శుక్రవారం, 30 నవంబరు 2018 (12:30 IST)
నా ప్రాణ స్నేహితుడు, నా భార్య ఇద్దరూ ఒకే కంపెనీలో పనిచేస్తున్నారు. నేను వేరే కంపెనీలో పనిచేస్తున్నాను. అప్పుడప్పుడు నాకు కుదరని పరిస్థితుల్లో నా భార్య అతడి బైక్ ఎక్కి ఆఫీసుకు వెళుతోంది. తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు కూడా అలాగే వస్తోంది. ఇదివరకు నేను వెళ్లి తీసుకువచ్చేవాడిని. ఈమధ్య నేను పికప్ చేసుకుంటానని ఫోన్ చేస్తే... ఎందుకు అవసరంగా అంత దూరం నుంచి కష్టపడి రావడం. నేను మీ స్నేహితుడి బండి మీద వచ్చేస్తానులే అంటోంది.


వాడి బైకు మీద ఆమె అలా రావడం నాకు అనుమానంగా ఉంది. ఇద్దరి మధ్య ఏమయినా సంబంధం కుదిరిందేమోనని ఆందోళనగా వుంది. ఇదే ఆలోచనతో ఇటీవల కాస్త మద్యం పుచ్చుకుంటున్నాను. దీనిపై ఆమెతో గొడవపడలేను. ఏం చేయాలో తోచడంలేదు...

 
మీ ఆలోచనలన్నీ అసమర్థమైనవి. అసలు మీకలాంటి నెగటివ్ ఆలోచనే రాకూడదు. భార్యాభర్తల సంబంధం అనేది నమ్మకం మీద నడుస్తుంది. ఏమాత్రం చిన్న అనుమానం వచ్చినా అది పెనుభూతం అవుతుంది. మీ ప్రాణ స్నేహితుడి పైన మీకు నమ్మకం లేదు, కట్టుకున్న భార్య మీద నమ్మకం లేదు అని లోలోన కుమిలిపోవడం కంటే... ప్రతిరోజూ మీ భార్యను మీరే బైకుపై ఎక్కించుకుని వెళ్లి తిరిగి ఇంటికి కూడా మీరు తీసుకుని రండి. అప్పుడు ఓ సమస్య వుండదు. నేను వస్తున్నాను అని ఆమెకు చెప్పడం కంటే... మీరే ఆమె ఆఫీసుకు వెళ్లి పికప్ చేసుకుని వచ్చేయండి. అంతేకాని... లోలోన కుమిలిపోతూ ఇంట్లో కూచుంటే సమస్య తీరదు. 

అన్నీ చూడండి

క్యాన్సర్ మందుల దందా.. 15,000 మందికి పైగా రోగుల మోసం.. వ్యక్తి అరెస్ట్

దివగంత సైనికుడు కుమార్తె పెళ్లికి తరలివచ్చిన సైనికులు... తండ్రిలేని లోటును తీర్చారు...

ఎమ్మిగనూరులో చెత్త కుప్పలో బ్యాలెట్ పత్రాలు లభ్యం.. ఏం జరుగుతోంది?

6 నెలలకి సరిపడా పాలపొడి ప్యాకెట్లు, నూనెలు రిజర్వ్ చేసుకోండి: వేణు స్వామి కొత్త వీడియో

30 ఏళ్ల తర్వాత కడప మేయర్ పీఠాన్ని దక్కించుకున్న తెలుగుదేశం

అన్నీ చూడండి

తిరునెల్వేలిలో యంగ్ రివల్యూషనరీ లీడర్ త్రిష ఫోరమ్.. ఫోటో వైరల్

ఫెయిర్‌నెస్ క్రీమ్ వాడితే నాకు కిడ్నీ వ్యాధి వచ్చింది, ఆస్పత్రి పాలయ్యా: మలయాళీ సింగర్ సలీం

మమితా బైజు, ప్రదీప్ రంగనాథన్‌ ఏఐ డీప్‌ఫేక్ వీడియోలు వైరల్

Vishnu Manchu : ప్రభుదేవా తో తమిళరంగంలోకి ఎంట్రీ ఇస్తున్న విష్ణు మంచు

Niharika Konidela: పాకెట్ రాకెట్స్ తో పింక్ ఎలిఫెంట్ మ్యూజిక్ లోకి అడుగు పెట్టిన నిహారిక కొణిదెల

తర్వాతి కథనం
Show comments