గురువారం, 26 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By selvi
Last Updated : సోమవారం, 15 జనవరి 2018 (10:58 IST)

అమావాస్య రోజు కనుమ- ఆంజనేయునికి కొబ్బరికాయ కొట్టాలట..

ఆంజనేయ స్వామికి కనుమ పండగ రోజు కొబ్బరికాయ కొట్టాలని జోరుగా ప్రచారం సాగుతోంది. అమావాస్య రోజున కనుమ రావడంతో.. పిల్లలున్న వారు పెద్ద కొబ్బరికాయలు కొట్టాలని ప్రచారం సాగుతోంది. దీంతో జనాలు ఆంజనేయ స్వామి ఆల

ఆంజనేయ స్వామికి కనుమ పండగ రోజు కొబ్బరికాయ కొట్టాలని జోరుగా ప్రచారం సాగుతోంది. అమావాస్య రోజున కనుమ రావడంతో.. పిల్లలున్న వారు పెద్ద కొబ్బరికాయలు కొట్టాలని ప్రచారం సాగుతోంది. దీంతో జనాలు ఆంజనేయ స్వామి ఆలయాలకు భారీగా తరలి వెళ్తున్నారు. ఈ సంక్రాంతి అరిష్టమని, ఇది పోవాలంటే హనుమంతుని గుడిలో చిన్న పిల్లలతో ప్రదక్షిణలు చేయించాలని సంక్రాంతి రోజున ప్రచారం సాగింది. 
 
ఇందుకు తోడు.. కనుమ రోజున పిల్లలున్న వారు హనుమంతుని గుడిలో సాధ్యమైనంత బరువున్న కొబ్బరికాయ కొట్టాలని ప్రచారం సాగుతోంది. అమావాస్య రోజున కనుమ పండగ రావడంతో కష్టాలు సంభవిస్తాయని, ఆ బాధలు తొలగిపోవాలంటే.. పిల్లలున్న మహిళలు.. చిన్నారులను ఆంజనేయ స్వామిని దర్శించుకునేలా చేయాలని అంటున్నారు. కొబ్బరికాయలు కూడా కొట్టాలని పూజారులు అంటున్నారు. సోషల్ మీడియాలో ఈ వార్తలు వైరల్ అవుతున్నాయి.