Webdunia - Bharat's app for daily news and videos

Install App

భాగవతంలో ఏముంది? ఎవరు భాగవతాన్ని వింటున్నారో..?

Written By సెల్వి
Updated: మంగళవారం, 9 ఫిబ్రవరి 2021 (19:28 IST)
భాగవతంలో ఏముంది? ధర్మం ఉంది. సత్య దర్శనం ఉంది. దాన్ని నిర్మొహమాటంగా బోధించి మనిషిని సరైన మార్గంవైపు మళ్ళించే తత్వం ఉంది. అదే సుఖజీవనానికి, తద్వారా మోక్షానికి మార్గమనే జ్ఞాన బోధ ఉంది.
 
అసత్య వస్తువును పట్టుకుంటే మరణ భయం కలుగుతుంది. మరణభయంలో అజ్ఞానం, అవిద్య ఉన్నాయి. అవి జీవిని అధోగతికి చేర్చుతాయి. కాబట్టి ఏది సత్యమో దాన్ని పట్టుకోగలగాలి. భాగవతాన్ని విన్నవారు లేక చదివినవారు మాత్రమే ఆ సత్యాన్ని తేలికగా పట్టుకోగలరు. దేనికైనా తట్టుకోగలరు. అలా పట్టుకునే జీవితసత్యాల గురించి భాగవతంలో ప్రతిపాదన చేశారు.
 
ఎవరు భాగవతాన్ని వింటున్నారో లేక చదువుతున్నారో వారికి సత్యంపట్ల పూనిక కలుగుతుంది. ఈశ్వరుడి (అంతర్యామి) పట్ల దృష్టి మరలుతుంది. ఆయన పాదాలు పట్టుకున్నవాళ్లు ఎలా తరించారో భగవంతుడి భక్తుల గాథలుగా భాగవతం బోధిస్తోంది. 
 
అంత సరళంగా భాగవతాన్ని శుక బ్రహ్మ ప్రవచనం చేశారు. దాన్ని అక్షరబద్ధం చేసింది వ్యాసభగవానుడు. మన అదృష్టం కొద్దీ ఆ జ్ఞాన సంపద మనందరికీ అందుబాటులో ఉంది. అందుకోగలిగిన వారికి ఆనందం కలుగుతుంది. అందుకోలేనివారికి అయోమయం మిగులుతుంది.

అన్నీ చూడండి

ఇది iPhone కోసం ఆత్మహత్య కాదు, వెనుక ఏదో వుంది...

ఆమె వల్ల పరువు పోతోంది.. చంపెయ్... : కుమార్తెను ప్రియుడితో హత్య చేయించిన తండ్రి

ఆంధ్రప్రదేశ్‌లో వర్చువల్ డాక్టర్ కన్సల్టేషన్లు, హోం హెల్త్ కేర్ సేవలను బలోపేతం చేసిన స్టార్ హెల్త్

కోట్లకు పడగలెత్తుతున్న యాచకులు, వీడియో చూడండి

మతం మారాలని సౌజన్యపై సాధిక్ ఒత్తిడి చేశాడు : కాకినాడ ఎస్పీ బిందు మాధవ్

అన్నీ చూడండి

25-08-2026 మంగళవారం ఫలితాలు - ఏకపక్ష నిర్ణయాలు తగవు...

భౌమ ప్రదోషం, శివపార్వతులను ఆరాధిస్తే ఆ సమస్యలన్నీ తీరుతాయి

24-08-2026 సోమవారం ఫలితాలు - మీ ఓర్పునకు పరీక్షా సమయం...

23-08-2016 నుంచి 29-08-2026 వరకు ఫలితాలు

23-08-2026 ఆదివారం నాటి మీ రాశి ఫలితాలు-అనుకూలతలు అంతంత మాత్రమే

తర్వాతి కథనం
Show comments