శుక్రవారం, 22 నవంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 2 ఫిబ్రవరి 2021 (17:27 IST)

సాలగ్రామ శిలామహత్మ్యం గురించి తెలుసా..? గంగానది కంటే?

shaligram stone
సాలగ్రామము విష్ణుప్రతీక. సర్వకాల సర్వ్యావస్థలయందు విష్ణువు సాక్షాతూ సాన్నిధ్యం కలిగి ఉండేది సాలగ్రామంలో మాత్రమే. అందుచేతే గృహదేవతార్చనలలోగానీ, దేవాలయాలలోగానీ సాలగ్రామము (మూర్తి) లేకుండా పూజలు కొనసాగవు. ద్వైతులు, విశిష్టాద్వైతులు, అద్వైతులు తమతమ దేవతార్చనలలో సాలగ్రామ రాళ్లను పూజకు ఉపయోగిస్తారు.
 
భారతదేశంలో సాలగ్రామ పూజ బహు పురాతనమైనది. క్రీస్తు కంటే ప్రాచీనుడైన అపస్తంబుడు సాలగ్రామ పూజను పేర్కొన్నాడు. త్రిమతాచార్యులు తమతమ భాష్యాలలో సాలగ్రామాలు విష్ణురూపాలని వివరించారు. సాధారణంగా ప్రతిమలకు నిత్య పూజా సమయంలో ఆవాహనాది షోడశోపచారాలు చేయాలి. సాలగ్రామాలలో దేవత నిత్యం సన్నిహితమై ఉండడం వల్ల వాటికి పూజా సమయంలో అవాహనాది ఉపచారాలు అవసరం లేదు.
  
సాలగ్రామాలు ఉన్న ఇల్లు గొప్ప పుణ్యక్షేత్రంతో సమానం. సాలగ్రామ దర్శనం వల్ల, స్పర్శవల్ల, అర్చనవల్ల అంతులేని పుణ్యం లభిస్తుంది. సాలగ్రామాలు శిలాజాలు. సాలగ్రామాల మీద వివిధ దేవతా చిహ్నాలు ఉంటాయి. ముఖ్యంగా చక్రం, పద్మం ప్రధాన చిహ్నాలు. విష్ణు భక్తులైన మాధ్వులకు, వైష్ణవులకు ఇవి పూజకు ఎంతో విలువైనవి. వైష్ణవ పురాణాలు, ఇతవ వైష్ణవ గ్రంథాలు వీటిని గురించి సవిస్తరంగా వివరిస్తాయి. సాలగ్రామాలలో బంగారం ఉంటుంది. అందుకే వాటిని హిరణ్యగర్భ అని కూడా అంటారు. 
 
సాలగ్రామ శిలామహత్మ్యం గురించి వేరే చెప్పనక్కరలేదు. తిరుపతిలో శ్రీ వేంకటేశ్వరునికీ, మంత్రాలయంలో శ్రీ రాఘవేంద్ర స్వామి వారికీ అంతటి మహిమ ఉండడానికి కారణం అక్కడ ఉండే సాలగ్రామాలు అంటారు. సాలగ్రామాన్ని పూజిస్తే ఎంత పుణ్యం లభిస్తుందో దాని దానం వలన కూడా అంతటి ఫలం లభిస్తుంది. 
 
సాలగ్రామ శిలయందు, చరాచరాత్మకమగు మూడు లోకాలు అణిగి ఉన్నాయి. ఆ కారణంగా సాలగ్రామాన్ని భక్తిశ్రద్ధలతో, పరిపూర్ణ విశ్వాసంతో, శాస్త్ర ప్రకారం అభిషేకిస్తే, కోటి యజ్ఞాలు చేసినంత పుణ్యఫలానికి సమానమవుతుంది. మరియు కోటి గోవులను దానం చేసినంత ఫలితాన్ని పొందుతారు. సాలగ్రామ పూజచే, శివకేశవులని పూజించిన ఫలితం కలుగుతుందిట.
 
సాలగ్రామం వున్న ప్రదేశాలలో స్నానం చేసినా, దానం చేసినా, కాశీ క్షేత్రంలో పవిత్ర గంగానదీ స్నానం కంటే, ఆ పుణ్యక్షేత్రంలో చేసిన దానం కంటే, నూరురెట్లు అధిక ఫలము కలుగుతుంది. 
 
ఒక్కసారి భక్తిశ్రద్ధలతో సాలగ్రామాన్ని శాస్త్ర ప్రకారం పూజించి, అభిషేకించితే కోటి లింగాలను దర్శించి, పూజించి, అభిషేకించిన ఫలితం కలుగుతుంది. సాలగ్రామమును ముందుంచు కుని పితృదేవతలకు తర్పణాలను ఇచ్చిన ఎడల, ఆ పితృదేవతలు స్వర్గంలో శాశ్వత సుఖాలను పొందుతారు.