సంబంధిత వార్తలు
- దిల్ రాజు బర్త్డే సెలెబ్రేషన్స్ - బిగ్ బాస్ అండ్ కిడ్..
- రెండున్నరేళ్ళ వయసు.. చనిపోతూ.. ఐదుగురికి ప్రాణం పోశాడు.. ఎలా?
- పింక్ బాల్ టెస్ట్ మ్యాచ్ : భారత్ తొలి ఇన్నింగ్స్లో 244 ఆలౌట్
- #Vivah Panchami 2020: భార్యాభర్తలు విడాకులు తీసుకున్నారా? (video)
- దేశం కోసం ఆడుతున్నాను.. కానీ తొలి బిడ్డ పుట్టే క్షణం కోసం..?: విరాట్ కోహ్లీ
భర్తృహరి సుభాషితం... పోయిపోయి పాముకి ఆహారమైంది
ఓ ఎలుక పాముల వాని ఇంట రాత్రివేళ ఆహారం కోసం అన్వేషిస్తూ ఒక పెట్టెకు కన్నం వేసి అందులో దూరింది. అంతకుముందే ఆ పెట్టెలో బంధింపబడి వున్న పాము ఇక వెలుపలికి వెళ్లే ఆశ లేదనుకుని అక్కడే చుట్ట చుట్టుకుని ఇంద్రియ పాటవం కోల్పోయి ఆకలితో అలమటిస్తూ వుంది.
ఎలుక తనంత తానే పోయి ఆ పాము నోట పడింది. పాము దాన్ని మ్రింగి ఆకలి తీర్చుకుని ఆ కన్నం ద్వారానే చరచరా వెలుపలికి వెళ్లిపోయింది. వృద్ధి, వినాశాలకు దైవమే కారణం. కనుక దైవం మీద భారం వేసి నెమ్మదిగా వుండాలి.
