గురువారం, 23 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 18 డిశెంబరు 2020 (10:46 IST)

#Vivah Panchami 2020: భార్యాభర్తలు విడాకులు తీసుకున్నారా? (video)

వివాహ పంచమి ధనుర్మాసంలో వచ్చే పండుగ. ఈ పండుగ ప్రాధాన్యతను తెలుసుకుందాం. ఈ పండుగ ఈ ఏడాది డిసెంబర్ 19, శనివారం వస్తోంది. మార్గశిర నెల శుక్ల పక్షం ఐదో రోజున ఈ పండుగు జరుపుకుంటారు. ఈ రోజున శ్రీరామునికి సీతమ్మ తల్లికి వివాహం జరిగినట్లు పురాణాలు చెప్తున్నాయి. ప్రతి సంవత్సరం మార్గశిర్ష శుక్ల పంచమిని రామ్ వివాహ మహోత్సవంగా జరుపుకుంటారు. ఈ రోజునే వివాహ పంచమి అని కూడా పిలుస్తారు. 
 
ఈ రోజున ఉపవాసం పాటిస్తారు. డిసెంబర్ 19 శనివారం మధ్యాహ్నం 02:00 గంటలకు ఈ తిథి ప్రారంభమవుతుంది. అందుకే ఈ రోజున వివాహ పంచమిగా జరుపుకుంటారు. మిథిలా రాజు జనకుడు తన ప్రియమైన కుమార్తె సీత కోసం స్వయంవరం నిర్వహిస్తాడు. ఈ వేడుకకు శ్రీరాముడు, అనుజుడు లక్ష్మణ్, గురువుతో విచ్చేస్తారు. చాలామంది యోధులు శివుడి విల్లును విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నిస్తారు, కానీ విఫలమవుతారు.
 
అప్పుడు రాముడు ఆ శివ విల్లును, విచ్ఛిన్నం చేసి సీతమ్మను రాముడు పొందుతాడు. మెడలో హారము ధరించి రాముడిని సీతమ్మ భర్తగా పొందుతుంది. ఈ శుభవార్త మిథిలా నుండి అయోధ్యకు పంపబడుతుంది. అక్కడ నుంచి రామ సోదరులు, పరివారమంతా జనకపురి విచ్చేస్తుంది. దశరథుడు నలుగురు భార్యలు, దేవతలు, మహర్షుల సమక్షంలో సీతారామకల్యాణం మార్గశిర శుక్ల పంచమిలో జరుగుతుంది. 
 
వివాహా పంచమి రోజున జనకపురి, అయోధ్యతో సహా దేశంలోని అనేక ప్రాంతాల్లో రామ వివాహ మహోత్సవాన్ని జరుపుకుంటారు. అలాగే చారిత్రక కోణం నుండి కూడా, తులసి దాస్ వివాహ పంచమి రోజున రామ్‌చరిత్రా మానస్ రచన పనిని కూడా పూర్తి చేశాడు. అందుకే వివాహంలో అడ్డంకులను ఎదుర్కొంటున్న అవివాహితులు ముఖ్యంగా సీతారాముల వివాహం జరిగినట్లు చెప్పబడుతున్న వివాహ పంచమి రోజున సీతారాములను ఆరాధిస్తే శుభపలితాలు చేకూరుతాయి.
 
రాముడికి పసుపు బట్టలు, తల్లి సీతకు ఎరుపు బట్టలు అర్పించి పూజలు చేస్తే సకల శుభాలు చేకూరుతాయి. ఈ రోజున పూజ చేసే దంపతులు సకలాభీష్టాలు నెరవేరి పది కాలాల పాటు చల్లగా వుంటారని విశ్వాసం. 
 
అలాగే విడాకులు పొందిన దంపతులు ఈ రోజున పూజ చేస్తే.. భార్యాభర్తలు మళ్లీ కలుసుకుంటారని నమ్మకం. ఇంకా పదే పదే భార్యాభర్తలు గొడవపడుతుంటే.., మనస్పర్దలు ఏర్పడుతుంటే, విభేదాలు తలెత్తితే.. వివాహ పంచమి రోజున సీతారాములను నిష్టతో స్తుతించాలని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు.