శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. కెరీర్
  3. కెరీర్ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 14 డిశెంబరు 2020 (15:06 IST)

ఆర్ఆర్‌బీ పరీక్షలు.. డిసెంబర్‌ 15 నుంచి 18 వరకు

ఆర్‌ఆర్‌బీ పరీక్షలు దేశ వ్యాప్తంగా రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. దేశవ్యాప్తంగా వివిధ కేంద్రాల్లో కంప్యూటర్‌ ఆధారితంగా ఈ పరీక్షలను నిర్వహించనున్నారు. 1663 పోస్టులకుగాను 1,02,940 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. తొలి విడతలో భాగంగా మినిస్టీరియల్‌ అండ్‌ ఐసోలేటెడ్‌ కేటగిరీ ఉద్యోగాలకు సంబంధించిన పరీక్షలు నిర్వహించ నున్నారు. 
 
ఇవి డిసెంబర్‌ 15 నుంచి 18 వరకు జరుగుతాయి. ఇందులో టీచర్‌, స్టెనోగ్రాఫర్‌ వంటి పోస్టులు ఉన్నాయి. దేశవ్యాప్తంగా వివిధ కేంద్రాల్లో కంప్యూటర్‌ ఆధారితంగా ఈ పరీక్షలను నిర్వహించనున్నారు. 1663 పోస్టులకుగాను 1,02,940 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.
 
రెండో విడతలో ఆర్‌ఆర్‌బీ నాన్‌ టెక్నికల్‌ పాపులర్‌ కేటగిరీ (ఎన్టీపీసీ) పోస్టులకు సంబంధించిన పరీక్షలు జరుగుతాయి. వీటిని ఈ నెల 28 నుంచి వచ్చేఏడాది మార్చి వరకు నిర్వహించనున్నారు. ఈ నోటిఫికేషన్‌ ద్వారా 35,208 పోస్టులను భర్తీ చేయనుంది. దీనికోసం 1,26,30,885 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇక, గ్రూప్‌-డీ పరీక్షలను వచ్చే ఏడాది ఏప్రిల్‌ నెలలో నిర్వహించనుంది.