Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేవతా వృక్షం అరటికి దీపారాధన చేస్తే?

Written By సిహెచ్
Updated: శనివారం, 18 జనవరి 2020 (21:47 IST)
వృక్షాల్లో దేవతలు కొలువుంటారని విశ్వాసం. వీటిలో అరటి చెట్టును పూజించడం ద్వారా విశిష్ట ఫలాలు లభిస్తాయి. అరటి కాండానికి పసుపు కుంకుమలతో, పుష్పాలతో చక్కగా అలంకరించి దీపారాధన చేయడం ద్వారా సంతానం ప్రాప్తిస్తుంది. దీపారాధనకు అనంతరం పెసరపప్పు, బెల్లం, తులసీదళాలను నైవేద్యంగా సమర్పించుకోవాలి. 
 
మధ్యాహ్నం పూట ఐదుగురు ముత్తయిదువులకు భోజనం పెట్టి.. వారికి దక్షిణ తాంబూలాదులు, ఐదేసి అరటి పండ్లను వాయనంగా ఇవ్వాలి. ఈ పూజ చేసేవారు సాయంత్రం చంద్రుని దర్శించుకున్న తర్వాతే భోజనం చేయాలి. అరటి పూజను సీతారాములు కూడా చేశారని విశ్వాసం. ఈ పూజను చేసినవారికి సంతానం కలగడంతో పాటు ఆర్థిక ఇబ్బందులు, ఈతిబాధలు తొలగిపోతాయట. ముఖ్యంగా అత్తింటి కష్టాలు తొలగిపోతాయని విశ్వాసం.
 
అరటి చెట్టును గురువు ప్రతీకగా భావిస్తారు. దేవ గురువు అయిన బృహస్పతికి అరటి చెట్టు సమానం అంటారు. అలాగే విష్ణువుకు కూడా అరటి చెట్టు ప్రీతికరమని.. గురువారం పూట అరటి చెట్టును పూజించే వారికి విష్ణుదేవుని అనుగ్రహం లభిస్తుందని విశ్వాసం. ఇంకా జ్యోతిష్య ప్రకారం అరటిచెట్టు మాంగల్య దోషాలను నివృత్తి చేస్తుంది. తద్వారా సంవత్సరాల పాటు సంతానం కలగని దంపతులకు.. అరటి పూజ ద్వారా సంతాన ప్రాప్తి చేకూరుతుందని పండితులు చెప్తున్నారు.

అన్నీ చూడండి

Jagtial: బస్సు నడుపుతుండగా ఆర్టీసీ బస్సు డ్రైవర్‌కు గుండెపోటు.. తర్వాత ఏమైందంటే?

రూ. 18 లక్షల బైక్‌పై వస్తుండగా రోడ్డు ప్రమాదం: ప్రముఖ యూట్యూబర్, బైక్ రైడర్ అషు మృతి

74 సార్లు అవమానించారు.. నాపై దాడి జరిగినా జగన్ ఒక్క మాట అడగలేదు..

బిడ్డను స్కూల్‌లో చేర్పించేందుకు వచ్చిన భార్య... ఇంటికి తీసుకెళ్లి హత్య చేసిన భర్త

పిల్లలకు మాతృభాషను నేర్పించే యాప్‌ను ప్రశంసించిన చంద్రబాబు

అన్నీ చూడండి

29-08-2026 శనివారం ఫలితాలు - కష్టించినా ఫలితం ఉండదు.. ఖర్చులు విపరీతం...

28-08-2026 రాశి ఫలితాలు - అనుకున్న లక్ష్యం సాధిస్తారు.. ధనలాభం వుంది..

సోదరునికి రాఖీ కడుతున్నారా? ఈ శ్లోకం చెబుతూ కట్టండి, టైమింగ్స్ ఏంటి?

రాఖీ పౌర్ణమి రోజున మూడు యోగాలు.. మేషరాశికి పట్టిందల్లా బంగారమే

శబరిమల ఆలయంలో బంగారం మాయం.. ప్రశాంత్‌కు మెదడులో రక్తస్రావం

తర్వాతి కథనం
Show comments