శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By జె
Last Modified: సోమవారం, 25 నవంబరు 2019 (20:37 IST)

అరటి పండును ఎలా తినాలో తెలుసా?

అరటిపండు మన శరీర బరువును బాగా పెంచుతుంది అని చాలామంది అనుకుంటుంటారు. అందుకే చాలామంది అరటిపండును తినరు. కొంతమంది అరటిపండును కొనడానికి బాగా భయపడతారు. కానీ అరటిపండును సరైన క్రమంలో తింటే అధిక బరువు అస్సలు పెరగరంటున్నారు వైద్య నిపుణులు.
 
అనేక రోగాలను అరటిపండు దూరం చేస్తుందట. మంచి ఔషధంలా కూడా పనిచేస్తుందట. అరటిపండును తినకూడని సమయంలో తింటేనే అది శరీరానికి హానికరమంటున్నారు వైద్యనిపుణులు. చాలామంది అరటిపండ్లను రోజూ మూడునాలుగు తినేస్తుంటారు. అలా తినకూడదట. రోజుకు రెండు మాత్రమే తినాలట. అది కూడా ఖాలీ కడుపుతో తినాలట. అలా తింటే స్లిమ్ కూడా అవుతారట.
 
అరటిపండులో ఫైబర్ సంపూర్ణంగా ఉంటుందట. కొంతమంది అరటిపండు తింటే మలబద్ధకం సమస్య వస్తుందనుకుంటారు. కానీ ఖాళీ కడుపుతో అరటిపండు తింటే శరీరంలో మంచి ప్రయోజనాలు ఉంటాయట. అరటిపండులో ఉన్న ఫైబర్ జీర్ణక్రియ శక్తిని పెంచుతుందట. అరటిపండులో కాల్షియం సంపూర్ణంగా ఉంటుందట. ఎవరికైతే ఎముకల్లో నొప్పులు ఉంటాయో.. జాయింట్ పెయిన్స్ ఉంటాయో.. పంటి నొప్పుల సమస్యలు ఉంటాయో వారు ఖాళీ కడుపుతో అరటిపండు తింటే ఈ సమస్యలన్నింటినీ చెక్ పెట్టొచ్చట.
 
పంటి నొప్పి నొప్పి ఎక్కువగా ఉన్న వారు కూడా అరటిపండు తింటే మంచిదట. అరటిపండులో విటమిన్ బి.6 ఉంటుందట. డయాబెటిస్ కూడా కంట్రోల్లో ఉంచుతుందట. హైబిపి సమస్య ఉంటుందో వారు అరటిపండును రెగ్యులర్‌గా తినాలి. శరీరంలో బ్లడ్ సంపూర్ణంగా ఉండాలంటే కూడా ఉదయాన్నే అరటిపండు తినాలట.