మాట్రిమోనీ మోసగాడు అరెస్ట్, పెళ్లి చేస్తానని రూ. 2 లక్షల మోసం

శ్రీ| Last Modified గురువారం, 21 నవంబరు 2019 (20:32 IST)
మాట్రిమోనీ సైట్‌ని వాడుకుని ఒక యువతిని మోసం చేసాడు ఫిజియో థెర‌పి విద్యార్థి బాణోత్ సాయినాథ్. ఖ‌మ్మంకి చెందిన సాయినాథ్‌ని రాచ‌కొండ సైబ‌ర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేసారు. ఇంత‌కీ సాయినాథ్ ఏం చేసాడంటే... మాట్రిమోనీలో పెట్టిన అమ్మాయి ప్రొఫైల్ నుండి బాధితురాలి ఫోటోలు మ‌రియు ఫోన్ నెంబ‌ర్ తీసుకుని వాట్సాప్ ద్వారా త‌న పేరు అవినాష్ రెడ్డి అని చెప్పి చాట్ చేసాడు.

కొన్నాళ్ల స్నేహం త‌ర్వాత‌ పెళ్లి చేసుకుంటాన‌ని ఆమెను న‌మ్మించాడు. ఇలా.. మాయ‌మాట‌లు చెప్పి బాధితురాలు నుండి రూ. 2.8 ల‌క్ష‌లు తీసుకున్నాడు. బాధితురాలు మ‌లేషియాలో ఐటీ జాబ్ చేస్తుంది. ఈమెతో పాటు మ‌రి కొంతమంది ఇత‌ర రాష్ట్రాల అమ్మాయిల‌ని కూడా డాక్ట‌ర్ సాయినాథ్ పేరుతో మోసం చేసిన‌ట్లు విచార‌ణ‌లో వెల్ల‌డ‌య్యింది.దీనిపై మరింత చదవండి :