Daily Horoscope
✕

శ్రీకృష్ణుడిని గోవిందా అనే నామంతో ఎవరు పిలిచారు? (video)

Written By సిహెచ్
Updated: మంగళవారం, 2 జులై 2019 (18:49 IST)
గోవు అంటే ఆవు. ఆలమందలతో నిరంతరం కొలాహలంగా ఉన్న నందగోకులంలో పెరిగిన శ్రీకృష్ణుని పేరు గోవిందుడు అని భాగవతంలో స్పష్టంగా కనిపిస్తుంది. కనుక ద్వాపరయుగంలో గోవింద నామంతో విష్ణువు సుప్రసిద్దుడయ్యాడు. ఈ కృష్ణునికి గోవిందుడు అనే నామం రావడానికి గల కారణాన్ని మన పురాణాలు ఇలా చెబుతున్నాయి.
 
బృందావనంలో నందమహారాజు ఇంద్రయాగం చేయాలనుకున్నాడు. కానీ ఆ యాగాన్ని ఏడేండ్ల బాలుడైన చిన్ని కృష్ణుడు వద్దన్నాడు. గోవులు, బ్రాహ్మణులు, గోవర్దన పర్వతం ప్రీతి చెందేలా యాగం చేయమన్నాడు. ఐతే ఆ యాగం వల్ల ఇంద్రునికి కోపం వచ్చి వానను కురిపించాడు. అప్పుడు కృష్ణుడు గోవులను రక్షించాడు. అందుకు సురభి అనే గోవు దేవతలు, మహర్షుల సమక్షంలో చిన్ని కృష్ణుడికి క్షీరాభిషేకం చేసి గోవిందుడు అనే నామాన్ని ఇచ్చింది.
 
ఈవిధంగా గోగణ రక్షణం చేసి దేవదేవుడైన శ్రీకృష్ణుడు గోవిందుడిగా ప్రసిద్ది చెందాడు. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు గోవిందుడుగా ఉన్నాడు. కాబట్టే కలియుగంలో కూడా ఆ గోవింద నామాలనే భక్తుల చేత పలికిస్తూ పరవశం చెందుతున్నాడు.

అన్నీ చూడండి

భారత్‌ను దుష్టశక్తులు విచ్ఛిన్నం చేయాలని చూస్తున్నాయి : మోహన్ భగవత్

975లో మాదిరిగానే నాకు ఆశ్రయమిచ్చారు: భారత్‌కు హసీనా థాంక్యూ నోట్‌

నవరత్న హామీలు - అపుడు జగన్మోహన్ రెడ్డి.. ఇపుడు వైకాపా వార్డు అభ్యర్థి (వీడియో)

పులివెందుల అసెంబ్లీ సీటు జగన్‌కు లేనట్టేనా? నెటిజన్స్ ట్రోల్స్

ఆయుధ పూజకు అతిథిగా వచ్చిన బారీ కొండ చిలువ (వీడియో)

అన్నీ చూడండి

20-10-2026 మంగళవారం రాశి ఫలాలు - ఆర్థిక విషయాల్లో ఇతరుల మాటల్ని నమ్మొద్దు

19-10-2026 సోమవారం ఫలితాలు - ఆశించిన ఆశించిన పదవి దక్కకపోవచ్చు...

18-10-2026... ఆదివారం నాటి రాశి ఫలాలు- కుటుంబ అవసరాల కోసం ముందుగానే..?

18-10-2026 నుంచి 24-10-2026 వరకు వారఫలాలు - భార్యాభర్తల మధ్య చీటికీ మాటికీ కలహం

Chanakya Niti: చాణక్య నీతి- ఎవరితోనూ పంచుకోకూడని ఐదు విషయాలేంటంటే?

తర్వాతి కథనం
Show comments