మంగళవారం, 7 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By pnr
Last Updated : సోమవారం, 12 జూన్ 2017 (16:52 IST)

పెళ్లీడుకొచ్చిన అమ్మాయికి పెళ్లి చేయకపోతే ఏమవుతుంది?

ఆకలి, దాహం, నిద్ర, బడలిక ఎంత సహజమో మనిషి మనసుకు కామం అంతే సహజమని మన వేదాలు చెపుతున్నాయి. 'కామం కొరకు, కామాన్ని ధర్మబద్ధం చేయుట కొరకు ఈమెను క్షేత్రముగా స్వీకరిస్తున్నాను' అని వేదమంత్రాల్లో పేర్కొంటున్న

ఆకలి, దాహం, నిద్ర, బడలిక ఎంత సహజమో మనిషి మనసుకు కామం అంతే సహజమని మన వేదాలు చెపుతున్నాయి. 'కామం కొరకు, కామాన్ని ధర్మబద్ధం చేయుట కొరకు ఈమెను క్షేత్రముగా స్వీకరిస్తున్నాను' అని వేదమంత్రాల్లో పేర్కొంటున్నారు. అంటే.. కామాన్ని అణుచుకోలేం కాబట్టి.. ఆ కామాన్ని ధర్మబద్ధం చేయడానికి ఒక క్షేత్రా(స్త్రీ)న్ని ధర్మబద్ధంగా స్వీకరించాలని మన వేదాల్లో చెబుతున్నాయి. అలా ధర్మబద్ధంగా స్వీకరించిన మహిళతో రతికేళి నిర్వహిస్తే ఎలాంటి దోషం లేదట. అలాంటి స్త్రీతో ధర్మబద్ధంగా స్వీకరించిన వ్యక్తి పొందిన కామోద్రేకం.. ఆయన చేసిన ధర్మాల్లో ఒకటిగా మిగిలిపోతుందట. 
 
అదేసమయంలో పెళ్లీడుకొచ్చిన అమ్మాయిలకు పెళ్లి ప్రతిపాదనలు చూడకుండా తన భార్యతో శృంగార తృప్తిని పొందే తండ్రి మహాపాపి అని శాస్త్రం చెపుతోంది. ఆడబిడ్డకు పెళ్లీడు వచ్చేస్తున్నా కూడా పెళ్లి సంబంధాలు చూడనటువంటి తండ్రికి శాస్త్రాల్లో వేసిన శిక్ష చాలా భయంకరమైనదిగా వుంది. 
 
పెళ్లీడుకొచ్చిన ఆడపిల్లకు సంబంధం చూడకుండా తల్లిగానీ, తండ్రిగానీ ఉండిపోతే ఆ గృహం పాపగృహంగా మారిపోతుందని శాస్త్రాల్లో పేర్కొనడం జరిగింది. యుక్త వయసు కంటే ఒక యేడాది ముందుగా పెళ్లిచేసినా తప్పులేదుగానీ, పెళ్లి ప్రతిపాదనలు చేయకుండా మిన్నకుండిపోవడం అనేది మహాపాపమని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. పెళ్లీడుకొచ్చిన అమ్మాయి భద్రత, శ్రేయస్సు దృష్ట్యా ఎక్కువ రోజులు ఇంట్లో ఉంచరాదనీ, దాన్ని సమాజం కూడా అంగీకరించదని వేదాల్లో పేర్కొనడం జరిగింది.