శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By TJ
Last Modified: గురువారం, 9 నవంబరు 2017 (15:40 IST)

ఆ ఒక్కరోజు మన్మథుడిని పూజిస్తే... భార్యాభర్తల మధ్య గొడవకు చెక్...

హిందూ సంప్రదాయంలో వివాహ వ్యవస్థకు ఎంతో ప్రముఖ స్థానం ఉంది. భార్యాభర్తలు అన్యోన్యంగా కలిసి హాయిగా జీవించేందుకు ఎన్నో వ్రతాలు, నోములు, పూజలు, పరిహారాలు ఉన్నాయి. ఇది ఎప్పటినుంచో ఆచరింపబడుతూ దాంపత్య జీవనాన్ని పటిష్టంగానూ, సుఖమయంగా గడపేందుకు ఎంతో దోహదపడుత

హిందూ సంప్రదాయంలో వివాహ వ్యవస్థకు ఎంతో ప్రముఖ స్థానం ఉంది. భార్యాభర్తలు అన్యోన్యంగా కలిసి హాయిగా జీవించేందుకు ఎన్నో వ్రతాలు, నోములు, పూజలు, పరిహారాలు ఉన్నాయి. ఇది ఎప్పటినుంచో ఆచరింపబడుతూ దాంపత్య జీవనాన్ని పటిష్టంగానూ, సుఖమయంగా గడపేందుకు ఎంతో దోహదపడుతున్నాయి. అలాంటి వాటిలో చైత్రమాసంలో వచ్చే అనంగత్రయోదశి ఒకటి. 
 
ఆ రోజు పరమేశ్వరుడిని పూజిస్తే సంవత్సరంలో ప్రతి రోజూ శివుడిని పూజించిన ఫలం లబిస్తుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. అదేవిధంగా ఆ రోజు మన్మథుని పూజిస్తే భార్యభర్తల మధ్య అన్యోన్యత వృద్ధి చెందుతుందట. భార్యభర్తల మధ్య అనురాగాన్ని పెంపొందింపజేసి, దాంపత్య జీవితంలో ఎటువంటి సమస్యలు రాకుండా చేసే వ్రతమే అనంగత్రయోదశీ వ్రతం. ఈ వ్రతాన్ని చైత్రమాసంలో శుక్ల పక్ష త్రయోదశీ నాడు ఆచరించాలి.
 
మానవుని జీవితానికి ఆధారమైన భూమిని వాస్తు ప్రకారం నైరుతి దిశతో పోల్చుతారు. ఈ దిశను నైరుతి లేదా కుబేర దిశగా పిలుస్తారని వాస్తు నిపుణులు అంటున్నారు. నైరుతి దిశ వాస్తులో కీలకమని, ఈ దిశలో ప్రధాన ద్వారాలు, తలుపులు, కిటికీలు వంటివి ఏర్పాటు చేయకూడదని వాస్తు చెబుతోంది.
 
ఈ దిశను తెరిచి వుంచకూడదని వాస్తు నిపుణులు సలహా ఇస్తున్నారు. ఈ దిశ ఎప్పుడూ ఎత్తుగా ఉండాలి, ఈశాన్యం తగ్గితే మంచిది. కుబేర దిశలో తలుపులు ఉండకపోవడం ద్వారా ఇంటి యజమానికి సానుకూల ఫలితాలు ఉంటాయి. ఇంకా దంపతుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందులు ఉండవని వాస్తు శాస్త్రం చెబుతోంది.
 
భార్యాభర్తల మధ్య విరోధము తొలగిపోవుటకు మూలమంత్రము...
ఓం నమో మహాయక్షిణ్యె మమ పతిం(ఆముకం) మే వశ్యం కురు కురు స్వాహా
 
భార్యాభర్తల మధ్య విరోధము వచ్చి భార్య పుట్టింటికి వెళ్లి వుండిపోయిన రోజులలో రాత్రిపూట ఆవు నేతితో దీపం వెలిగించి ఆ దీపం వద్ద స్త్రీ కుర్చుని పైన వ్రాసిన మంత్రమును 108 సార్లు చొప్పున 11 రాత్రులు జపం చేస్తే ఆమె భర్త తనంత తానుగా వచ్చి తన భార్యను ప్రేమగా తీసుకువెళతారని విశ్వాసం. సుఖంగా కలతలు లేకుండా కాపురం చేస్తారనేది విశ్వాసం.