ఆదివారం, 12 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 2 ఏప్రియల్ 2022 (10:05 IST)

ఉగాది రోజున పచ్చడి తప్పనిసరి.. పంచాంగ శ్రవణం..?

teతెలుగు వారి అతి ముఖ్యమైన పండుగ ఉగాది. ముఖ్యంగా ఈ పండుగ నుంచి అంతా మంచే జరగాలని అంతా కోరుకుంటారు. ఉగాది పండుగ రోజున కచ్చితంగా పచ్చడి చేయాలి. ఈ పచ్చడికి నవగ్రహాలకు సంబంధం ఉందని చాలా మందికి తెలియదు. 
 
ఉగాది పచ్చడిలోని తీపికి గురుడు, ఉప్పుకు చంద్రుడు, కారానికి కుజుడు, మిరియాల పొడికి రవి, పులుపుకి శుక్రుడు అన్ని రుచులు కలిపిన వారికి శని, బుధ గ్రహాలు కూడా కారకులవుతారని పండితులు చెబుతున్నారు. 
 
పచ్చడి తీసుకునేందుకు ఉగాది అత్యంత అనుకూలమైన సమయం కాబట్టి, ఈ సమయంలో ‘శతాయు వజ్రదేహాయ సర్వసంపత్కరాయచ, సర్వారిష్ట వినాశాయనింకం దళబక్షణం' అనే మంత్రాన్ని ప్రత్యేకంగా జపించి ఈ పచ్చడిని తీసుకోవాలి. దీనర్థం.. వందేళ్ల పాటు వజ్రదేహంతో ఎలాంటి కష్టాలు లేకుండా జీవించాలని కోరుకోవడం.
 
ఉగాది రోజున చేయాల్సిన మరో ముఖ్యమైన పని. పంచాంగ పూజ, పంచాంగ శ్రవణం. ఉగాది రోజు తెలుగు వారికి నూతన సంవత్సరానికి ప్రారంభ రోజు కాబట్టి.
 
ఈరోజు మీ పూజా గదిలో పంచాంగం కచ్చితంగా ఉండాలి. కొత్త ఏడాదిలో మనం చేయాల్సిన కార్యక్రమాలకు అనువైన వాటిని చూపించే కరదీపికగా దీన్ని భావిస్తారు.