ఉగాది రోజున ఆలస్యం నిద్ర లేచారో...?
ఉగాది రోజున కొన్ని పనులు పొరపాటున కూడా సూర్యోదయానికి తర్వాత నిద్రపోకూడదని పండితులు చెప్తున్నారు. ఉగాది రోజు మాత్రం ఆలస్యంగా నిద్రలేవడం మంచిది కాదంటున్నారు. అలాగే ఉగాది రోజున మాత్రం మాంసాహారం, మద్యం లాంటివి తీసుకోకూడదు. ఇక ఉగాది రోజు చాలా మంది పంచాంగ శ్రవణం చేస్తుంటారు.
అయితే అలా పంచాంగ శ్రవణం దక్షిణ ముఖంగా కూర్చొని చేయకూడదు. అలాగే ఉగాది రోజున కొత్త గొడుగు కొనుక్కుంటే మంచి కలుగుతుంది. ఇక కొత్తబట్టలు, కొత్త ఆభరణాలు వేసుకోవడం ఉగాది రోజు మామూలే.
అలానే ఉగాది రోజు దానం చేస్తే మంచి ఫలితం వస్తోంది. పూర్వం అయితే పండగపూట విసనకర్రలు దానం చేసేవారు. అలాగే ఇంట్లో ఉగాది పూజ దమనంతో చేయాలని పండితులు అంటున్నారు.