ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 1 ఏప్రియల్ 2022 (13:32 IST)

తెలంగాణ ప్రజలకు టీఎస్‌ఆర్టీసీ ఉగాది ఆఫర్‌

తెలంగాణ ప్రజలకు టీఎస్‌ఆర్టీసీ ఉగాది ఆఫర్‌ ప్రకటించింది. ఏప్రిల్‌​ 2న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 65 ఏళ్లకు పైబడిన సీనియర్‌ సిటిజన్స్ అందరూ ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయవచ్చని టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ ప్రకటించారు. 
 
ఈ మేరకు ఆయన ట్విటర్‌ వేదికగా ప్రకటించారు. కేవలం ఏప్రిల్‌ రెండో తేదీ ఉగాది పండుగ సందర్భంగా మాత్రమే ఈ అవకాశాన్ని కల్పిస్తున్నట్లు తెలిపారు. 
 
బస్సుల్లో ప్రయాణించేటపుడు తమ దగ్గర ఉన్న గుర్తింపు కార్డును (65 ఏళ్లు దాటినట్లు ఏదైనా వయసు ధ్రువీకరణ పత్రం) బస్సులోని కండక్టర్‌కు చూపించి ఉచితంగా ప్రయాణం చేయవచ్చని సూచించింది.