సోమవారం, 27 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By chj
Last Modified: బుధవారం, 16 ఆగస్టు 2017 (15:03 IST)

వామ్మో... కలలో నల్లపిల్లి... నాలుక పిడచకట్టుపోయింది... అర్థం ఏంటో తెలుసా?

పిల్లి ఎదురొచ్చింది అనగానే చాలా భయపడిపోతుంటాం. ముఖ్యంగా పిల్లి శకునాన్ని చాలామంది నమ్ముతుంటారు. ఏ శుభకార్యానికైనా బయలుదేరుతుంటే చాలు... పిల్లి అగుపడిందంటే ఇక అన్నీ పడేసి ఇంట్లోనే కూర్చుండిపోతారు. పిల్లి శకునం అంత భయంకరంగా నమ్ముతుంటారు. పిల్లి ఎదురొస్

పిల్లి ఎదురొచ్చింది అనగానే చాలా భయపడిపోతుంటాం. ముఖ్యంగా పిల్లి శకునాన్ని చాలామంది నమ్ముతుంటారు. ఏ శుభకార్యానికైనా బయలుదేరుతుంటే చాలు... పిల్లి అగుపడిందంటే ఇక అన్నీ పడేసి ఇంట్లోనే కూర్చుండిపోతారు. పిల్లి శకునం అంత భయంకరంగా నమ్ముతుంటారు. పిల్లి ఎదురొస్తేనే ఇలా చేస్తే ఇక పిల్లి కలలోకి వస్తే ఏంటి సంగతి?
 
చాలామంది కలలో పిల్లి కనిపిస్తే దురదృష్టమని అని అనకుంటారు. కానీ పిల్లిని పెంచుకునేవారు మాత్రం తమ శక్తికి అది చిహ్నం అని చెప్పుకుంటారు. ఐతే ఏ రంగు పిల్లి కలలో కనిపిస్తే దానికి తగినట్లు ఫలితం వుంటుందట. తెల్లపిల్లి కనబడితే కష్టాలు రాబోతున్నాయని, నల్లపిల్లిని చూస్తే మానసిక సామర్ధ్యాలు ఉపయోగించేందుకు భయపడుతున్నట్లు అర్థమట.
 
పిల్లిని మీరు వెంబడిస్తున్నట్లుగానో, తరుముతున్నట్లుగానో కల వస్తే అడ్డంకులను అధిగమించడానికి మీరు చేసే ప్రయత్నానికి ఇది సూచన అని చెపుతున్నారు. కాబట్టి పిల్లి కలలోకి వస్తే ఇలాంటి ఫలితాలు వుంటాయన్నమాట.