శుక్రవారం, 10 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 28 డిశెంబరు 2024 (09:51 IST)

Tirumala Facts: బంగారు గోపురం.. వైకుంఠం నుంచి నేరుగా కొండమీదకి దిగారట!

Tirumala
Tirumala
Tirumala Facts: తిరుమల ఎన్నో కథలకు, ఎన్నో మహాత్మాయాలకూ ప్రసిద్ధి. ఈ ఆలయ శిఖరాన్ని విమానం అని పిలవడానికి కూడా ఒక కారణం ఉంది. 28వ కలియుగంలో ఆ శ్రీమహావిష్ణువు వైకుంఠం నుండీ నేరుగా ఈ కొండ మీదకి తన విమానంలో దిగాడనీ పురాణ కథనం. అలా వచ్చినప్పుడు తొండమాన్ చక్రవర్తి స్వామివారికి గుడి నిర్మించేటప్పుడు ఆ విమానాన్ని యధాతధంగా ఉంచేశాడట. ఆ ఆలయం కాలగర్భంలో కలిసిపోయింది.
 
క్రీస్తు పూర్వం 3వ శతాబ్ధంలో లభ్యమయ్యే తమిళ సాహిత్యంలో 'తిరువేంగడం' అనే పేరుతో ఈ ఆలయం గురించి వర్ణించారు కవులు. అందులో సూర్య చంద్రులు ఆరాధిస్తుండగా ఒక పద్మ పీఠంపై స్వామి నిలబడి ఉన్నారు అని వర్ణించబడి ఉంది. అంటే 3వ శతాబ్ధానికి పెద్దగా గుడి ఏమీ లేక, ఆరుబయటే గుడి ఉంది అని చరిత్రకారులు తీర్మానించారు. తరువాత ఇప్పుడు మనం చూస్తున్న గర్భాలయం క్రీస్తు శక్తం 900 సంవత్సరానికి ముందు కాలానికి చెందినదని తెలుస్తోంది. 
 
లోపల గర్భ గృహంలో ఉన్న వేంకటేశ్వరస్వామి విగ్రహానికి అచ్చమైన నకలులాంటి ఒక చిన్ని విగ్రహాన్ని ఈ గోపురంపైన చెక్కించారు. గర్భాలయానికి ప్రదక్షిణగా వెళ్ళినప్పుడు వాయువ్యమూలన, ఉత్తరాభిముఖంగా భక్తులకు దర్శనమిస్తున్నాడు ఈ స్వామివారు. ప్రస్తుతం విమాన స్వామికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.