Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

తంజావూరు బృహదీశ్వరాలయం.. రహస్యాలు, వింతలు

Written By కుమార్
Updated: శనివారం, 1 జూన్ 2019 (12:24 IST)
భారతదేశంలోనే అతిపెద్ద శివలింగం ఉన్న శివాలయం తమిళనాడులోని తంజావూరులో ఉంది. వేయి సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ ఆలయంలో ఎన్నో అంతుచిక్కని రహస్యాలు, వింతలు ఉన్నాయి. తంజావూరులోని ఈ ఆలయం పేరు బృహదీశ్వరాలయం.
 
13 అంతస్థులతో నిర్మితమైన ఈ ఆలయ నిర్మాణానికి ఎటువంటి ఉక్కు గాని సిమెంట్ కాని వాడలేదు. పూర్తిగా గ్రానైట్ రాయితో కట్టబడింది. భారతదేశంలో 13 అంతస్థులు కలిగిన ఏకైక పురాతన క్షేత్రం ఇదే. 
 
ఇక్కడి శివలింగం ఎత్తు 3.7 మీటర్లు కాగా నందీశ్వరుని విగ్రహం ఎత్తు 2.6 మీటర్లు. 80 టన్నుల ఏకశిలతో చేసిన గోపుర కలశం ఈ ఆలయ విశేషం. మనం మాట్లాడుకునే శబ్దాలు ఈ ఆలయంలో మళ్లీ ప్రతిధ్వనించవు. అంతటి శబ్ద పరిజ్ఙానంతో ఈ ఆలయాన్ని నిర్మించారు.
 
మిట్ట మధ్యాహ్న సమయంలో ఈ ఆలయ గోపురం నీడ ఎక్కడా పడదు. గుడి నీడ కనపడినా గోపురం నీడ మాత్రం చూడలేము. ఈ ఆలయం చుట్టూ ఉన్న రాతి తోరణాలలో ఆరు మిల్లీమీటర్ల కన్నా తక్కువ పరిమాణంలో ఉండే వంపుతో కూడిన రంధ్రాలు కనిపిస్తాయి.
 
అసలు అవి అలా ఎందుకు పెట్టారనేది ఇప్పటికీ మిస్టరీనే. వేయి సంవత్సరాల ఆలయాలు దాదాపు పాడుబడిన స్థితిలో ఉంటాయి, అయితే ఈ ఆలయం మాత్రం ఇప్పటికీ అత్యధ్భుతంగా కొత్తగా నిర్మించినట్లు కనిపిస్తుంది. ఈ ఆలయం ప్రపంచ వారసత్వ జాబితాలో చేరింది.

అన్నీ చూడండి

పద్మావతి అమ్మవారి ఆలయం వద్ద ఏనుగు బీభత్సం - మావటిపై దాడి

చావంటే భయంలేదు.. ఫ్లైట్‌ను కూల్చివేయాలన్నదే ప్లాన్ : ఫ్లైదుబాయ్ కో కెప్టెన్ వాంగ్మూలం

సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్‌పై అవినీతి ఆరోపణలు - విచారణకు కేరళ సర్కారు ఆదేశం

రిజర్వేషన్లు వ్యతిరేకించేవారు అగ్రవర్ణ ప్రజలు పారిశుద్ధ్య పనులు చేయండి: గుజరాత్ మాజీ సీఎం వాఘేలా

ఢిల్లీ జంతర్ మంతర్ ఆందోళన : మహిళా జర్నలిస్టులకు లైంగిక వేధింపులు

అన్నీ చూడండి

05-10-2026 సోమవారం ఫలితాలు - ఆశించిన పదవి దక్కకపోవచ్చు...

04-10-2026 - ఆదివారం రోజువారీ రాశి ఫలాలు - ఆర్థిక వ్యవహారాల్లో స్పష్టత పెరుగుతుంది

అక్టోబర్ 10 నుండి 18 వరకు వైభవంగా బతుకమ్మ పండుగ

04-10-2026 నుండి 10-10-2026 వరకు వారఫలాలు - శుభలేఖ అందుకుంటారు

03-10-2026 శనివారం మీ రాశి ఫలాలు - కొత్త అవకాశాలు మీ ముందుకు వస్తాయి

తర్వాతి కథనం
Show comments