శుక్రవారం, 11 అక్టోబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 1 ఏప్రియల్ 2022 (07:35 IST)

భద్రాచలంలో నిత్యకళ్యాణం - ప్రసాదం టిక్కెట్ ధరల పెంపు

తెలంగాణా రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన భద్రాచలం ఆలయంలో అర్జిత సేవల టిక్కెట్ల ధరలను పెంచేశారు. ప్రసాదం ధరను కూడా పెంచారు. శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో ప్రసాదం, అభిషేకం, అర్జన, కేశఖండన టిక్కెట్ ధరలను ఒక్కసారిగా పెంచేశారు. ముఖ్యంగా, నిత్య కళ్యాణం, అభిషేకం టిక్కెట్ ధరను ఏకంగా రూ.1500 చేశారు. 
 
అలాగే, ప్రస్తుతం రూ.15గా ఉన్న కేశఖండన ధరను కూడా రూ.20కి పెంచారు. నిత్యకళ్యాణం టిక్కెట్ ధర రూ.1500, అర్చన టిక్కెట్ ధర రూ.300, అభిషేకం టిక్కెట్ ధర రూ.1500 చొప్పున పెంచుతూ ఆలయ కమిటి నిర్ణయం తీసుకుంది. 
 
అదేవిధంగా 100 గ్రాముల చిన్న లడ్డు ధర రూ.20 నుంచి రూ.25కు పెంచగా, పులిహోర ధర రూ.10 నుంచి రూ.15కు పెంచింది. చక్కెర పొంగలి ధర రూ.10 నుంచి రూ.15కు పెంచారు. అదేవిధంగా అర కేజీ బరువు ఉండే మహాలడ్డు బరువును 400 గ్రామాలు తగ్గించారు. ధరను మాత్రం రూ.100గా ఉంచారు.