శుక్రవారం, 10 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By జె
Last Modified: శుక్రవారం, 5 మార్చి 2021 (19:58 IST)

కరోనా కేసులు పెరుగుతున్నాయి, తిరుమల దర్శనం టోకెన్లు పెంచాలా? లేదా?

తిరుమలలోని అన్నమయ్య భవన్‌లో డయల్ యువర్ ఈవో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఏప్రిల్ 14 ఉగాది నుంచి ఆర్జిత సేవలకు భక్తులను అనుమతిస్తున్నట్లు ఇఓ జవహర్ రెడ్డి చెప్పారు. ఏప్రిల్ 14 తరువాత వయోవృద్ధులు, వికలాంగులును ప్రత్యేకంగా దర్శనానికి అనుమతించే ఏర్పాట్లు చేస్తామన్నారు. సర్వదర్శనం భక్తులకు ప్రస్తుతం 22 వేల టోకెన్లు జారి చేస్తున్నట్లు చెప్పారు. సర్వదర్శన టోకేన్లు అంచెలవారిగా 40 వేలకు పెంచుతామన్నారు.
 
మహరాష్ట్ర తదితర రాష్ట్రాలలో కోవిడ్ కేసులు పెరుగుతుండటంతో.... దర్శన టోకేన్లు పెంపుపై పరిస్థితి బట్టి నిర్ణయం తీసుకుంటామన్నారు. అడ్వాన్స్ రిజర్వేషన్లో టిక్కెట్లను పొందిన భక్తులను మాత్రమే ఆర్జిత సేవలకు అనుమతిస్తామని, రెండు నెలలు తర్వాత కరెంట్ బుకింగ్ విధానంలో ఆర్జిత సేవా టిక్కెట్లును విడుదల చేస్తామన్నారు. దేవాదాయశాఖ పరిధి లోని ఆలయాలను ఇకపై టిటిడి పరిధిలోకి తీసుకోనున్నామన్నారు.
 
చారిత్రక నేపథ్యం వున్న ఆలయాలకు అవసరమైతేనే నిధులు కేటాయింపు చేస్తామని స్పష్టం చేశారు. ఇప్పటివరకు 32 ఆలయాలను టిటిడి పరిధిలోకి తీసుకున్నామన్న ఇఓ కళ్యాణ మండపాలు నిర్మించేందుకు నూతన నిబంధనలు అనుసరిస్తామన్నారు.