ఇటీవల కాలంలో దేశవ్యాప్తంగా పిల్లల్లో పోషకాహార లోపం పెరుగుతోందని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. కొన్నేళ్లుగా ఈ విషయంలో ఎంతో కష్టపడి సాధించిన ప్రగతి ఎందుకు తిరుగుముఖం పట్టింది? కారణాలు ఏంటి? బీబీసీ ప్రతినిధి రాక్సీ గగ్డేకర్ అందిస్తున్న కథనం. గుజరాత్‌కు చెందిన 37 ఏళ్ల నందా బరియా ఒక వలస కార్మికురాలు. ప్రస్తుతం ఆమె ఏడు నెలల కడుపుతో ఉన్నారు. ఈ సమయంలో ఆమె మూడు నెలలపాటు తన సొంతూరు...