శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 19 ఫిబ్రవరి 2021 (10:52 IST)

కరోనా వ్యాప్తి కొనసాగింపు.. 24 గంటల్లో 13వేల కేసులు

దేశంలో కరోనా వ్యాప్తి ఇంకా కొనసాగుతూనే ఉంది. కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో కొత్తగా 13,193 మంది మహమ్మారి బారినపడ్డారు. దీంతో మొత్తం కేసులు 1,09,63,394లకు చేరాయి. 
 
ఇందులో 1,06,67,741 మంది బాధితులు వైరస్‌ నుంచి కోలుకోగా, 1,56,111 మంది కరోనా ప్రభావంతో మరణించారు. మరో 1,39,542 మంది చికిత్స పొందుతున్నారు. కాగా, ఇప్పటివరకు కరోనాతో 97 మంది మరణించగా, కొత్తగా 10,896 మంది మహమ్మారి బారినుంచి బయటపడ్డారని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.
 
అలాగే, గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 10,896 కరోనా బాధితులు కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు 1,06,67,741 మంది బాధితులు కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం దేశంలో 1,39,542 ఆక్టివ్ కేసులు ఉన్నాయి.