శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : శనివారం, 6 ఫిబ్రవరి 2021 (10:58 IST)

తెలంగాణలో 24 గంటల్లో 161 కరోనా కేసులు

తెలంగాణలో గత 24 గంటల్లో 35,421 కరోనా పరీక్షలు నిర్వహించగా 161 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన కరోనా కేసుల వివరాల ప్రకారం... గత 24 గంటల్లో కరోనాతో ఒకరు ప్రాణాలు కోల్పోగా, అదే సమయంలో 147 మంది కోలుకున్నారు. ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,95,431 కి చేరింది. 
 
ఇప్పటివరకు మొత్తం 2,91,846 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య 1,608కి పెరిగింది. తెలంగాణలో ప్రస్తుతం 1,977 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 845 మంది హోం క్వారంటైన్‌లో చికిత్స తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీలో కొత్తగా 28 కరోనా కేసులు నమోదయ్యాయి.