Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

శ్రీవారి అర్జిత సేవా టిక్కెట్ల ధరల పెంపుపై వెనక్కి తగ్గిన తితిదే

Written By ఠాగూర్
Updated: ఆదివారం, 6 మార్చి 2022 (17:01 IST)
తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) పాలక మండలి మరోమారు వెనక్కి తగ్గింది. ఇటీవల శ్రీవారి అర్జిత సేవా టిక్కెట్ల ధరలను భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీనిపై సర్వత్రా విమర్శలు వచ్చాయి. 
 
ఈ టిక్కెట్ల పెంపుపై తితిదే పాలక మండలి సభ్యుల మధ్య జరిగిన చర్చకు సంబంధించిన వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. ఈ చర్చ చేపల మార్కెట్‌లో బేరం చేసినట్టుగా ఉంది. ఈ నేపథ్యంలో అర్జిత సేవా టిక్కెట్ల ధరల పెంపుపై తితిదే తీసుకున్న నిర్ణయంపై వెనక్కి తగ్గింది. 
 
శ్రీవారి ఆలయంలో కరోనా కారణంగా గత రెండేళ్ళుగా భక్తులను అర్జిత సేవలకు అనుమతించడం లేదు. దర్శనానికి కూడా పరిమిత సంఖ్యలోనే అవకాశం కల్పిస్తున్నారు. గత పాలక మండలి సమావేశంలో టేబుల్ అజెండాగా అర్జిత సేవా టిక్కెట్ల ధరల పెంపుపై చర్చ చేపట్టారు. 
 
సామాన్య భక్తులకు ధరలు పెంచబోమంటూనే సిఫారసు లేఖలపై కేటాయించే అర్జిత సేవా టిక్కెట్ల ధరలను పదింతలు పెంచుతూ ప్రతిపాదన చేశారు. దీనిపై భక్తులు మండిపడ్డారు. అర్జిత సేవా టిక్కెట్లు సామాన్యులకు అందుబాటులో లేకుండా చేశారని విమర్శలు చేశారు. 

అన్నీ చూడండి

గృహహింసను భరించలేక గొంతుపై కాలితో తొక్కి చంపేశాను.. పోలీసులకు వాంగ్మూలమిచ్చిన మహిళ

Hyderabad: ట్రాలీ ఆటోలో ఇనుప కడ్డీ పడటంతో స్కూటర్‌పై వెళ్తున్న మృతి

పాపం... జైలర్‌గా పని చేసిన జైలుకే ఖైదీగా తరలింపు... చేసిన తప్పేంటో తెలుసా?

స్టింగ్ ఆపరేషన్ వెనుక ఉన్న పితామహుడు ఎవరో తెలుసు : సీఎం డీకే శివకుమార్

అక్టోబర్ 09, 2026: శుక్రవారం నాటి తెలుగు రాష్ట్రాల వాతావరణం ఎలా వుందంటే?

అన్నీ చూడండి

తిరుమల బ్రహ్మోత్సవాలకు TNSTC ప్రత్యేక బస్సులు

09-10-2026 - శుక్రవారం నాటి రాశి ఫలాలు - ఆర్థిక లావాదేవీల్లో స్పష్టత పాటిస్తే..?

మహాలయ అమావాస్య రోజున చేయకూడని పనులు ఏంటంటే?

Navaratri Home Mandir Vastu 2026: నవరాత్రి.. ఇంటి నుంచి తొలగించాల్సిన వస్తువులు.. వాస్తు టిప్స్

08-10-2026 - గురువారం నాటి రాశి ఫలాలు - పనిభారం పెరిగినా సమయపాలనతో?

తర్వాతి కథనం
Show comments