Daily Horoscope
✕

సింహ వాహనంపై కోదండరాముడు

Written By ఎం
Updated: శుక్రవారం, 23 ఏప్రియల్ 2021 (20:01 IST)
ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడ‌వ‌‌ రోజు శుక్ర‌వారం రాత్రి  సింహ వాహ‌నంపై స్వామివారు  సీతా, లక్ష్మణ సమేతంగా ద‌ర్శ‌న‌మిచ్చారు. కోవిడ్ -19 వ్యాప్తి నేప‌థ్యంలో ఆల‌యంలో ఏకాంతంగా వాహ‌న‌సేవ నిర్వ‌హించారు.
 
సింహం పరాక్రమానికి, ధైర్యానికి, తేజస్సుకు, ఆధిపత్యానికి, మహాధ్వనికి సంకేతం. ఉదయం నిద్ర లేవగానే దర్శించే వస్తువుల్లో 'సింహదర్శనం' అతి ముఖ్యమైంది. సింహ రూప దర్శనంతో పైన పేర్కొన్న శక్తులన్నీ చైతన్యమవుతాయి. సోమరితనం నశించి పట్టుదలతో ప్రవర్తించి సర్వత్రా విజయులమై ఆధిపత్యంతో రాణించే స్ఫూర్తి సిద్ధిస్తుంది. అజ్ఞానంతో ప్రవర్తించే దుష్టులను సంహరించడంలో నేను, నా వాహనమైన సింహము  సమాన ప్రయత్నంతో ఉంటామని ఈ సింహ వాహనం ద్వారా స్వామివారు తెలియజేస్తున్నారు.
 
ఈ కార్యక్రమంలో ఏఈవో శ్రీ ముర‌ళీధ‌ర్‌, సూప‌రింటెండెంట్ శ్రీ వెంక‌టేశ‌య్య‌, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీ ధ‌నంజ‌యులు,  ఇతర అధికారులు పాల్గొన్నారు.

అన్నీ చూడండి

దుబాయ్ నుంచి ప్రేమతో: ఆలోచనాత్మక హాలిడే బహుమతుల కోసం ఒక గైడ్

తనిష్క్ తరహాలో బీహార్‌లో భారీ దోపిడీ.. పట్టపగలే రూ.40 కోట్ల బంగారం ఎత్తుకెళ్లారు.. మళ్లీ వస్తామంటూ?

సోనియా గాంధీ బయోగ్రఫీ పుస్తకంలో రాష్ట్ర ప్రస్తావన ఎందుకు లేదు: కేటీఆర్

చెక్ బౌన్స్ కేసులో నిర్మాత బండ్ల గణేష్‌కు ఏడాది జైలు శిక్ష..

నేలపై జాతీయ జెండా మార్కర్.. ప్రధాని నరేంద్ర మోదీ ఏం చేశారంటే? (video)

అన్నీ చూడండి

ఇంట్లో సంపద పెరగాలంటే.. గురువారం ఊరగాయలను కొనిపెట్టండి..

18-11-2026 - బుధవారం రాశి ఫలాలు- ఆర్థికంగా అనుకూలత కనిపించినా..?

కార్తీక మాసం తొమ్మిదో రోజున తులసీ పూజ.. సిరిసంపదల కోసం...?

17-11-2026- మంగళవారం రాశి ఫలాలు- అనవసరమైన వాదనలకు దూరంగా ఉంటే?

16-11-2026 సోమవారం దిన ఫలాలు - చేస్తున్న పనులపై శ్రద్ధ వహించండి...

తర్వాతి కథనం
Show comments