మంగళవారం, 26 నవంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 15 జులై 2020 (11:47 IST)

తిరుమలలో కరోనా భయం .. కనిపించని భక్తుల సందడి

ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన తిరుమలలో కరోనా వైరస్ ఆవహించింది. ఫలితంగా నిత్యం భక్తులతో సందడిగా కనిపించే తిరుమల గిరులు భక్తుల రద్దీ లేక బోసిబోయి కనిపిస్తున్నారు. అసలే లాక్డౌన్ ఆంక్షలతో అరకొర భక్తులతో కనిపించే శ్రీవారి పుణ్యక్షేత్రం.. కరోనా భయం కారణంగా భక్తుల తాకిడి గణనీయంగా తగ్గిపోయింది. 
 
నిజానికి కరోనా లాక్డౌన్‌కు ముందు ప్రతి రోజూ కనీసం 50 వేల నుంచి లక్ష మంది వరకు భక్తులు శ్రీవారిని దర్శించుకునేవారు. ఈ సంఖ్య వారంతాల్లో, సెలవుల్లో అయితే భక్తుల సంఖ్య లక్ష దాటేది. భక్తుల గోవింద నామస్మరణలతో తిరుమల గిరులు మారుమ్రోగేవి. 
 
కానీ ఇప్పుడలాలేదు. కరోనా భయంతో భక్తులు తిరుమల ప్రయాణాన్ని వాయిదా వేసుకుంటున్నారు. లాక్డౌన్ ఆంక్షలు సడలించి భక్తులను దర్శనానికి అనుమతించడం మొదలుపెట్టాక ఇంతవరకు స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య కేలవం 2.50 లక్షలు మాత్రమే. 
 
అయితే తిరుమలకు వెళ్లిన భక్తులు ఎవరికీ ఇంతవరకు కరోనా సోకలేదు. కానీ, తితిదే ఉద్యోగుల్లో 91 మందికి పాజిటీవ్ నిర్ధారణ అయింది. దీంతో భక్తులు కూడా తిరుమల పుణ్యక్షేత్రానికి వచ్చేందుకు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ఫలితంగా తిరుమల భక్తుల సందడి పెద్దగా లేకుండా కనిపిస్తోంది.