Festival Posters

తిరుమల భక్తులు హ్యాపీ, గంటలో సర్వదర్శనం

Written By సెల్వి
Updated: మంగళవారం, 26 సెప్టెంబరు 2023 (11:39 IST)
తిరుమల భక్తులకు ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి. శ్రీవారి బ్రహ్మోత్సవాలు మంగళవారంతో ముగియనున్న నేపథ్యంలో శ్రీవారి సర్వదర్శనానికి వెయిటింగ్ లేకుండా, భక్తులను నేరుగా ఆలయంలోకి పంపిస్తున్నారు. 
 
కేవలం ఒక గంట వ్యవధిలోనే భక్తులకు సర్వదర్శనం ద్వారా స్వామి వారి దర్శనం లభిస్తోంది. చాలా కాలం తర్వాత ఇంత సులువుగా స్వామి వారి దర్శనం లభిస్తుండటంతో భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే.. శ్రీవారి బ్రహ్మోత్సవాలు మంగళవారంతో చివరి రోజుకు చేరుకున్నాయి. 
 
చివరి రోజున శ్రీవారికి పుష్కరిణిలో అర్చకులు శాస్త్రోక్తంగా చక్రస్నానాన్ని నిర్వహించారు. మరోవైపు సోమవారం శ్రీవారిని 72,137 మంది భక్తులు దర్శించుకున్నారు. స్వామి వారి హుండీకి రూ. 3.37 కోట్ల ఆదాయం వచ్చిందని టీటీడీ తెలిపింది.

అన్నీ చూడండి

ఏయ్ దూరం పాటించు అని చెప్పిన మహిళా బైకర్‌ను కారుతో ఢీకొట్టాడు, వీడియో

మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది మసూద్ అజార్‌ను పట్టిస్తే 70 లక్షల పాక్ రూపాయలు

మహిళతో వివాహేతర సంబంధం - రూ.29 కోట్ల నిధుల దుర్వినియోగం - అరెస్టు

ఖైరతాబాద్ గణేశుడికి గవర్నర్ తొలి పూజ... సీఎం చంద్రబాబు నివాసంలో చవితి వేడుకలు

మద్యం మత్తులో మహిళా బైకరును వేధించిన అకతాయిలు..

అన్నీ చూడండి

15-09-2026 రాశి ఫలితాలు, ఎవరినీ అతిగా విశ్వసించవద్దు

ఆ భయమే మనిషి మనశ్శాంతిని హరించివేస్తుంది: శ్రీ కృష్ణ పరమాత్మ

#HappyVinayakaChavithi : వినాయక చవితి వ్రత కథ - గణపతి జననం

13-09-2026 ఆదివారం మీ రాశి ఫలితాలు.. ఆర్థిక నిర్ణయాల్లో తొందరపడకుండా...?

13-09-2026 నుంచి 19-09-2026 వరకు వార ఫలితాలు.. ఏ రాశికి లాభం..

తర్వాతి కథనం
Show comments