అలిపిరి నడకమార్గం సుందరీకరణకు రూ.7.5 కోట్లు

గురువారం, 7 అక్టోబరు 2021 (21:05 IST)
తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) పాలక మండలి కీలక నిర్ణయం తీసుకుంది. కోట్లాది మంది శ్రీవారి భక్తులు నడిచివెళ్లే అలిపిరి నడకమార్గాన్ని మరింతగా సుందరీకరించనుంది. ఇందుకోసం రూ.7.5 కోట్ల నిధులను కేటాయించింది. 
 
అలాగే, కడప జిల్లా రాయచోటిలో కల్యాణమండపం నిర్మాణానికి రూ.2.21 కోట్లు మంజూరు చేయడానికి ఆమోదం తెలిపారు. ఇకపోతే, జమ్మూకాశ్మీర్‌ రాష్ట్రంలోని జమ్మూలో శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణానికి రూ.17.40 కోట్లు మంజూరు చేయడానికి ఆమోదించారు.
 
తిరుమల తిరుపతి దేవస్థాన ఉద్యోగుల ఆరోగ్య నిధికి కూడా పాలకమండలి ఆమోదం తెలిపింది. టీటీడీ కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ సిబ్బంది ఉద్యోగ భద్రతకు ఆప్ కాస్ తరహాలో కార్పొరేషన్ ఏర్పాటుకు ఆమోదించారు. 
 
స్విమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో వివిధ నిర్మాణాలకు రూ.4.46 కోట్ల నిధులు కేటాయించారు. వరాహస్వామి విశ్రాంత భవనం-2లో మరమ్మతులకు రూ.2.61 కోట్లు మంజూరు చేశారు. వీటితోపాటు మరికొన్ని అభివృద్ధి పనులకు కూడా తితిదే పాలక మండలి ఆమోదం తెలిపింది. 

అన్నీ చూడండి

బ్రిటన్‌లో తొలి ఏఐ మంత్రిగా భారతీయుడు

Mysuru: భార్య, ఇద్దరు కుమార్తెల గొంతు నులిమి చంపేసిన భర్త

దారుణం, రెండ్రోజుల వయసున్న ఆడ శిశువును సంచీలో పెట్టి రోడ్డుపక్కన వదిలేసారు

తిరుగుబాటు నేతలను మళ్లీ పార్టీలో చేర్చుకునే ప్రసక్తే లేదు : మమతా బెనర్జీ

అత్తారింటికి వెళ్లిన కూతురు ఆర్జించే డబ్బులో సగం పుట్టింటికా? ఇదేదో ఆలోచించాల్సిందే, వీడియో

అన్నీ చూడండి

21-07-2026 మంగళవారం ఫలితాలు- తప్పుచేశామన్న భావం రానీయకండి

బోనాల ఉత్సవాల కోసం గోల్కొండ కోటకు పోటెత్తిన భక్తులు

20-07-2026 సోమవారం ఫలితాలు - వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు...

19-07-2026 ఆదివారం ఫలితాలు - వస్తులాభం.. వస్త్రప్రాప్తి ఉన్నాయి....

19-07-2026 నుంచి 25-07-2026 వరకు మీ వార రాశి ఫలితాలు

తర్వాతి కథనం
Show comments